ముద్దుగుమ్మ ఆదాశర్మకి కోపమొస్తే ఏం జరుగుతుందో తెలుసా? అబ్బో చాలా కష్టమే. సోషల్ మీడియాలో స్పెషల్ క్లాస్ తీసేసుకుంటుంది మరి. టేక్ కేర్. అయితే సోషల్ మీడియాలో హాట్ హాట్ పిక్స్‌తో ఆదాశర్మ క్యూట్ క్యూట్‌గా అలరిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఘాటు ఘాటుగా క్లాస్ పీకేస్తోంది. ఏమైందో ఏమో తెలీదు కానీ ఆదా శర్మ ఘాటు స్పందన వింటే మీరే షాక్ అవుతారు.
హీరోయిన్స్ రీల్ లైఫ్‌కీ, రియల్ లైఫ్‌కీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఏదో సోషల్ మీడియాలో హాట్ హాట్ పిక్స్ పోస్ట్ చేశాం కదా అని, రియల్ లైఫ్‌లో ఎక్కడ పడితే అక్కడ తాకి, ఏది పడితే అది చేస్తామంటే అస్సలు ఊరుకోమని అందులోనూ నేనైతే అస్సలు ఊరుకోననీ, అక్కడికక్కడే సరైన బుద్ది చెప్తాననీ అంటోంది ఈ బ్యూటీ. అంతేకాదండోయ్ రీల్ లైఫ్‌ని దృస్టిలో పెట్టుకుని, మా మీద పిచ్చ రాతలు రాయడం, మంచిది కాదు. ఆదాశర్మని టచ్ చేస్తే చెంప పగిలిపోద్ది అని వార్నింగ్ ఇచ్చింది. అంతటితో ఆగితేనా ఈ బ్యూటీ.. రాయడానికి వీలు లేని పదాలను కూడా వాడి చాలా చాలా ఫైర్ అయిపోయింది. అక్కడ.. పంచ్ ఇచ్చిందంటే లేస్తారో లేదో తెలీదంది.
అంటే అంతగా ఆదాశర్మని ఇబ్బంది పెట్టింది ఎవరో కానీ, ఇంత ఘాటుగా ఆదాశర్మని ఎప్పుడూ చూడలేదు. ఇంకా ఈ బ్యూటీ ఏం చెప్పిందంటే, సినిమాల్లో తమ పాత్ర కెమెరా ముందు డైరెక్టర్ చెప్పింది చేయడమే. అది ఓన్లీ యాక్టింగ్.. అది మీరు గుర్తించాలి. అది మా ప్రొఫిషన్ అంతే. ప్రొఫిషన్‌లో భాగంగా లిప్ టు లిప్ కిస్ అయినా, హాట్ హాట్ హగ్స్ అయినా ఏదైనా చేస్తాం అని సెలవిచ్చింది ఆదా. 'హార్ట్ ఎటాక్'లో నితిన్‌తో లిప్ లాక్, బాలీవుడ్‌లో 'కమాండో 2'లోనూ లిప్ లాక్ సీన్స్‌లో నటించింది ఆదా. కానీ అది ఓన్లీ రీల్ వరకే అంటోంది. రియల్ లైఫ్ జోలికి వస్తే అంతే సంగతి అంటోంది. అవును నిజమే మార్షల్ ఆర్ట్స్‌లోనూ అమ్మడికి ప్రావీణ్యం ఉంది.
సో టేక్ కేర్ ఎబౌట్ హెర్! లేదంటే పవర్ పంచ్ పడుద్ది అంతే!