యంగ్ హీరో ఆదికి కెరీర్ మొదట్లో ఓకే అనిపించినా, తర్వాత మాత్రం సోలో హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. దాంతో మల్టీ స్టారర్స్‌కి కమిట్ అయ్యాడు. 'శమంతకమణి' తదితర మల్టీ స్టారర్స్‌లో వన్ ఆఫ్ ది హీరోగా నటించాడు. ఆ సినిమాలు సక్సెసా? ఫెయిల్యూరా? అనే సంగతి పక్కన పెడితే, ఏదైనా గుంపులో గోవిందా అని కొట్టుకుపోయాయి. తర్వాత హీరోగా తాను చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూనే వచ్చాడు.
'నెక్ట్స్ నువ్వే' సినిమాతో సుధీర్‌బాబు వంటి యంగ్ హీరోస్‌కి కలిసొచ్చిన హారర్ కామెడీని కూడా ట్రై చేసేశాడు. కానీ అది కూడా ఫలించలేదు. జస్ట్ ఓకే అని సరిపెట్టుకున్నాడు. ఇక ఇప్పుడు వరుసగా ఆది రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి రొమాంటిక్ డ్రామా. శ్రీనివాస్ నాయుడు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అందాల భామ సురభి ఈ సినిమాలో ఆదితో జోడీ కడుతోంది. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు ఆది.
ఇదో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ అని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంతో మరో కొత్త దర్శకున్ని పరిచయం చేస్తున్నాడీ యంగ్ హీరో. ప్రముఖ మాటల రచయిత డైమండ్ రత్నం ఈ చిత్రంతో మెగాఫోన్ పడుతున్నాడు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. హీరోయిన్, కథా కమామిషు వంటి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.