దిల్‌రాజు ఎంత ప్రయత్నించినా టాక్ మార్చడం సాధ్యపడలేదు. 'శ్రీనివాస కళ్యాణం' నిరాశ పరిచేసింది. ఈ సినిమాని ప్రమోట్ చేసేందుకు చేయాల్సిన విశ్వ ప్రయత్నాలు చేసేశాడు దిల్‌రాజు. విడుదలైన మొదటి రోజే మిక్స్‌డ్ టాక్ వచ్చేసింది. ఒక వర్గం ప్రేక్షకులు ఒక్కసారి చూసేందుకు జస్ట్ ఇష్టపడ్డారు.
కానీ సినిమా సక్సెస్ టాక్ సంపాదించాలంటే అది చాలదు. అందుకోసం సినిమా విడుదలయ్యాక కూడా చాలా చాలా మార్గాల్లో దిల్‌రాజు ప్రమోషన్స్ నిర్వహించారు. కానీ రిజల్ట్‌లో, టాక్‌లో నో ఛేంజ్. దిల్ రాజు సినిమాలకు ఓవర్సీస్‌లో మాంచి మార్కెట్ ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ టాక్ వచ్చిన సినిమాలు కూడా దిల్ రాజు బ్రాండ్‌తో అక్కడ మంచి ఆదరణ పొందిన రోజులున్నాయి. కానీ అక్కడ కూడా ఈ సినిమా నిలదొక్కుకోలేకపోయింది.
తొలి రోజు ఓకే అనిపించినా, సేమ్ టైంలో విడుదలైన అడవిశేష్ 'గూఢచారి' క్రెడిట్ కొట్టేసింది. ఇక్కడా అక్కడా కూడా ఈ సినిమా ఓ రేంజ్‌లో దున్నేసింది. వసూళ్లలో రాజా అనిపించుకుంది. ఇక వెరీ లేటెస్టుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'గీత గోవింద' సినిమా దెబ్బకి 'శ్రీనివాస కళ్యాణం' తట్టుకోలేకపోయింది. ఇక తేరుకోవడం కూడా కష్టమేనని చిత్ర యూనిట్‌కి కూడా తెలిసిపోయింది కాబోలు. ప్రమోషన్స్ కూడా ఆల్‌మోస్ట్ ఫుల్ స్టాప్ పెట్టేసినట్లుగానే కనిపిస్తోంది.
ఎంత ప్రయత్నించినా దిల్‌రాజు ఫార్ములా ఎందుకో ఈ సారి బెడిసికొట్టేసింది.