గీత గోవిందం సినిమా విడుదలకావడం తొలి షో నుండే మంచి టాక్ తెచ్చుకుని బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్న వేళ నిర్మాత బన్ని వాసు ఒక మంచి ఆలోచన చేశారు.
అదేంటంటే- ఈ చిత్రం కేరళ లో వసూలు చేసే కలెక్షన్స్ మొత్తాన్ని కేరళ వరద బాధితుల సహాయార్ధం కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.
ఇప్పటికే తెలుగు హీరోలు చాలామంది తమకి వీలైనంత మేర విరాళాలు ప్రకటించారు, గీత గోవిందం హీరో విజయ్ కూడా రూ 5 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి ఇవ్వడం జరిగింది.
ఒక మంచి పనికి తమ చిత్ర కలెక్షన్స్ విరాళంగా ఇవ్వడం అభినందనీయం.