బంటీతో క్యూట్‌ క్యూట్‌గా..!

మరిన్ని వార్తలు

రవిబాబు నుండి వస్తున్న మరో విలక్షణ చిత్రం 'అదుగో'. బంటీ అనే పందిపిల్ల ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. నాలుగు రోజుల్లో ఈ సినిమా ధియేటర్స్‌లో సందడి చేయనుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేసింది చిత్ర యూనిట్‌. అందులో భాగంగా ఓ పోస్టర్‌ విడుదల చేశారు. అభిషేక్‌ వర్మ, నభా నటేష్‌ జంటగా నటిస్తున్నారు. 

లేటెస్టుగా విడుదల చేసిన పోస్టర్‌లో హీరో, హీరోయిన్‌తో పాటు కీలక పాత్రధారి బంటీ కూడా ఉంది. బంటీకి హీరోయిన్‌ నభా నటేష్‌ క్యూట్‌గా ముద్దిస్తున్నట్లుగా ఉంది. ఓ ఫన్నీ ఎక్స్‌ప్రెషన్‌తో పక్కనే హీరో కనిపిస్తున్నాడు. విలక్షణ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన రవిబాబు పందిపిల్లతో సినిమా చేయడానికి తీసుకున్న టైం చాలా చాలా ఎక్కువ. తాను ఎంచుకున్న పంది పిల్ల కాన్సెప్టే ఆ ఆలస్యానికి కారణమని రవిబాబు గతంలోనే చెప్పాడు. ఎట్టకేలకు సినిమా పూర్తైంది. మొన్నామధ్య విడుదల చేసిన టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. 

పందిపిల్లతో డాన్సులు, ఫైట్లు ఇలా ఒక్కటేమిటి అన్నీ చేయించేశాడు రవిబాబు. అవన్నీ చూసిన పిల్లలు వావ్‌ బంటీ అనుకున్నారు. పిల్లలే కాదు, పెద్దలు కూడా అరె బంటీగాడు భలేగున్నాడు అనుకున్నారు. మొత్తానికి పిల్లల్నీ, పెద్దల్నీ కూడా మన బంటీ ఎట్రాక్ట్‌ చేసేసింది. ధియేటర్స్‌లోకి వచ్చాక బంటీ సందడి ఎలా ఉంటుందో చూడాలిక. 

ఇకపోతే అనువాద చిత్రమే అయినా ఆ టైంకే మరో పెద్ద సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. అదే విజయ్‌ నటిస్తున్న 'సర్కార్‌'. మరి సర్కార్‌తో బంటీకి పోటీ అని చెప్పలేం కానీ, చూద్దాం వసూళ్ల పరంగా బంటీ ఎంత కలెక్ట్‌ చేస్తాడో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS