ఆదిపురుష్ గ్రాఫిక్స్ బడ్జెట్ తెలిస్తే షాకే

మరిన్ని వార్తలు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 'ఆదిపురుష్' చిత్రం అధికారిక ప్రకటన ఈమధ్యే వచ్చింది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందించనున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టి-సీరీస్ వారు నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కనున్న ఈ సినిమాను పలు ఇతర భారతీయ భాషల్లోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తారు. ఇదిలా ఉంటే ఈ సినిమా బడ్జెట్, విజువల్ ఎఫెక్ట్స్ గురించి తాజాగా కొంత సమాచారం బయటకు వచ్చింది.

 

ఈ సినిమాను టి-సిరీస్ వారు రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారని అంటున్నారు. ఇక ఈ సినిమా మొత్తం షూటింగ్ గ్రీన్ మ్యాట్ తో జరుగుతుందని, లొకేషన్లు, పోరాట సన్నివేశాలు అన్నీ గ్రాఫిక్స్ లో ప్లాన్ చేశారని అంటున్నారు. ఈ విజువల్ ఎఫెక్ట్స్ కోసం సినిమాలో సగం బడ్జెట్ అంటే రూ.250 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యారు. అంటే దాదాపుగా '2.0' సినిమా విజువల్ ఎఫెక్ట్స్ బడ్జెట్ కంటే ఇది ఎక్కువ అని మనం చెప్పుకోవచ్చు.

 

ఈ సినిమా లొకేషన్ల అబ్బురపరిచే రీతిలో ఉంటాయని, 'అవతార్' సినిమా విజువల్ ఎఫెక్ట్స్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఈ సినిమాను ఒక విజువల్ వండర్ గా తీర్చిదిద్దేందుకు ఈ స్థాయిలో విఎఫ్ఎక్స్ కోసం భారీగా ఖర్చు పెట్టేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం అవుతుంది. 2022 లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఇప్పటికే ఫిలింమేకర్స్ ప్రకటించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS