భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న ప్రభాస్ చిత్రాల్లో ఒకటి ‘ఆదిపురుష్’. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామాయణ మహాకావ్యాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించారు. బాలీవుడ్ నటి కృతిసనన్ సీత పాత్రలో కనిపించగా, నటుడు సైఫ్ అలీఖాన్ లంకేశుడిగా కనిపిస్తున్నారు.
ఇప్పటికే దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్రీడీ పనులు లాస్ ఏంజెల్స్ లో మొదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని త్రీడీలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కట్టుదిట్టంగా త్రీడీ వర్క చేస్తున్నారు. ఈ సినిమా మొత్తం బడ్జెట్ విలువ రూ.400 కోట్లని సమాచారం.
దాదాపు 15 స్వదేశీ, అంతర్జాతీయ భాషల్లో.. ప్రపంచవ్యాప్తంగా 20,000 థియేటర్లలో ఒకేసారి ఈ సినిమా విడుదల కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. 12జనవరి 2023 లో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.