ఈ రోజుల్లో సినిమా అంటే... స్వీట్ అండ్ షార్ప్ గా ఉండాల్సిందే. ఎంత గొప్ప స్టార్ వున్నా... నిడివి విషయం లో జాగ్రత్త గా ఉండాల్సిందే. రన్ టైం అటూ ఇటూ ఐతే.. సినిమా ఫలితాల్లో తేడా వచ్చేస్తుంది. అందుకే ఈ మధ్య సినిమాలన్నీ రెండు గంటల్లోనే ముగుస్తున్నాయి. ఐతే... సంక్రాంతి కి రాబోతున్న ఆదిపురుష్ రన్ టైం.. దాదాపుగా 3 గంటల 15 నిమిషాలు వచ్చిందని సమాచారం. ఇది రఫ్ కట్ అనుకుంటే పొరపాటే. దాదాపుగా ఇదే ఫైనల్ వెర్షన్. ఇప్పుడు ఇదే వెర్షన్ ని సెన్సార్ కి కూడా పంపుతారు. ఆ తరవాత ఫైనల్ ట్రిమ్మింగ్ ఉంటుంది. కాకపోతే దర్శకుడు ఓం రౌత్ మాత్రం సినిమా నిడివి పెరిగినా పర్వాలేదు అంటున్నాడట. రామాయణం నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఇది వరకటి రోజుల్లో రామాయణ, మహాభారత నేపథ్యంలో సాగిన సినిమాలన్నీ నిడివి పరంగా పెద్దవే. అందుకే రన్ టైం పెద్ద సమస్య కాదన్నది చిత్ర బృంద అభిప్రాయం. నిజానికి ఆదిపురుష్ తెలుగు సినిమా కాదు. నార్త్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని తీసిన సినిమా. అక్కడ ప్రేక్షకులకు పెద్ద పెద్ద సినిమాలు చూడడం అలవాటే.
నిజానికి ఈ సినిమా ఫైనల్ అవుట్ పుట్ 3 గంటల 40 నిమిషాల వరకూ వచ్చిందట. దాన్ని కొంత ట్రిమ్ చేశారు. రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్ లా ఓం రౌత్ కూడా తెలివిగా ఆలోచిస్తే... మరో గంట ఫుటేజ్ జోడించి రెండు భాగాలుగా రిలీజ్ చేసేవాడేమో. అలా ఐతే... నిర్మాతలకు మరింత లాభాలు వచ్చి ఉండేవి. ఈ ఐడియా ఓం రౌత్ కు ఎందుకు తట్టలేదబ్బా..?