ట్రైలర్‌ టాక్‌: మక్కీకి మక్కీ 'అర్జున్‌రెడ్డి'ని దించేశారుగా.!

మరిన్ని వార్తలు

తమిళ 'అర్జున్‌ రెడ్డి' ట్రైలర్‌ని తాజాగా విడుదల చేశారు. మక్కీకి మక్కీ 'అర్జున్‌ రెడ్డి' ట్రైలర్‌నే తలపిస్తోంది. 'ఆదిత్య వర్మ' టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాతో విక్రమ్‌ తనయుడు ధృవ్‌ హీరోగా పరిచయమవుతోన్న సంగతి తెలిసిందే. ట్రైలర్‌లో ఇంచుకైనా మార్పు లేకున్నా, ధృవ్‌ మంచి నటుడు అని ట్రైలర్‌తోనే చెప్పేశాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. తొలి సినిమాకే నటనలోని వేరియేషన్స్‌ని బాగా పండించాడు.

 

రా యాక్టింగ్‌, డైలాగ్‌ డెలివరీ అన్నింట్లోనూ మంచి మార్కులు కొట్టేశాడు. అయితే, ఆల్రెడీ తెలుగులో విజయ్‌ దేవరకొండ, హిందీలో షాహిద్‌ కపూర్‌లకు ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ ఇచ్చింది. మరి ధృవ్‌కి ఎలాంటి రిజల్ట్‌ ఇస్తుందో కానీ, ట్రైలర్‌ అయితే తమిళ తంబీలకు తెగ నచ్చేసింది. తెలుగు, హిందీ ప్రేక్షకులకు ఆల్రెడీ పరిచయమైపోయిన సబ్జెక్ట్‌ కావడంతో, అంతగా ఆశక్తి లేదు కానీ, తమిళ తంబీలైతే మస్త్‌ ఖుషీ అవుతున్నారులే.

బనితా సందు ఈ సినిమాతో హీరోయిన్‌ గా పరిచయమవుతోంది. ఫస్ట్‌ సినిమానే అయినా, బనితా సందు కూడా తన పాత్రలో ఒదిగిపోయింది. ఇక మూతి ముద్దుల విషయానికొస్తే, తమిళ అర్జున్‌రెడ్డి కూడా ఏమీ తగ్గలేదు సుమీ. ఏకంగా ట్రైలర్‌లోనే ఐదారు లిప్‌లాక్‌లు లాగించేశారు హీరో, హీరోయిన్లు. సో ఇంకేముంది కోలీవుడ్‌ యూత్‌కీ ఈ సినిమా మాంచి బూస్టప్‌ అవుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. గిరిశయ్య దర్శకత్వం వహిస్తున్న 'ఆదిత్య వర్మ' వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS