సిద్దార్థ్ - అదితి పరిణయం

మరిన్ని వార్తలు

హీరో సిద్దార్థ్‌ - హీరోయిన్ అదితిరావ్ హైదరి వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లి సీక్రెట్ గా జరిగినట్టు సమాచారం. వీరి పెళ్లి గూర్చి మీడియాకి ఎలాంటి న్యూస్ లేదు. పెళ్లి ఫొటోస్ కూడా బయటికి రాలేదు. వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం టెంపుల్‌ లో బుధవారం వీరిద్దరికి పెళ్లి జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ  వేడుకకి అటెండ్ అయినట్టు సమాచారం. వనపర్తి సంస్థానాధీశులు కట్టించిన ఆలయంలో పూర్తి ఆంక్షల మధ్య తమిళ సాంప్రదాయంలో పురోహితులు వేద మంత్రాల మధ్య ఈ వివాహ తంతు ముగిసింది.   


అదితి హైదరాబాద్ అమ్మాయి. హిందీ , తెలుగు , తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది అదితి. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన మహా సముద్రం సినిమాలో సిద్ధార్థ్ - అదితి కలిసి నటించారు. ఆ టైంలో ఎరప్పడ్డ పరిచయం ప్రేమగా మారి 2021 నుంచి లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. వీరు కూడా తమ రిలేషన్ ని ఎప్పుడూ దాచలేదు, పబ్లిక్ గా ఈవెంట్స్ కి , పార్టీలకి, కలిసే అటెండ్ అయ్యేవారు. ఓ షోలో మీతో జీవితాంతం కలిసి డ్యాన్స్‌ చేయాలనుకునే అమ్మాయి ఎవరైనా ఉన్నారా? అని సిద్దార్థ్‌ ని ప్రశ్నించగా 'అదితి' దేవో భవ అంటూ హింట్ ఇచ్చాడు. ఇప్పుడు ఇలా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. మొత్తానికి సిద్దార్థ్ ఒక ఇంటివాడు అయ్యాడని అంతా సంతోషిస్తున్నారు.      


వీరిద్దరికీ ఇది సెకండ్ మ్యారేజ్. అదితి సత్యదీప్‌ మిశ్రాను పెళ్లి చేసుకుని, 2012లో డివోర్స్ తీసుకుంది. అప్పటినుంచి ఒంటరిగా ఉంటోంది. సిద్దార్థ్‌ కి కూడా తన చిన్ననాటి స్నేహితురాలు మేఘనతో పెళ్లయింది. 2007లో వీరు కూడా డివోర్స్ తీసుకున్నారు. సిద్దార్థ్  సమంత, సోహా అలీఖాన్, శృతి హాసన్ లతో ఎఫైర్స్ నడిపినట్టు టాక్. కానీ అవి ఏవి వర్కౌట్ కాలేదు చివరికి అదితితో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. సోషల్ మీడియా వేదికగా ఫాన్స్ సిద్దుకి విషెస్ చెప్తున్నారు.

ALSO READ : IN ENGLISH


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS