రామ్ చరణ్ సినిమా లో మరో హీరోయిన్

మరిన్ని వార్తలు

ఈ రోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే కావటంతో సెలబ్రిటీస్ పలువురు సొషల్మీడియా వేదికగా  విషెస్ చెప్తున్నారు. మెగా ఫాన్స్ తమ అభిమాన హీరో జన్మదినాన్ని సెలబ్రేట్ చేస్తూ, మంచి సందడి చేస్తున్నారు. చెర్రీ అమ్మ సురేఖ తన తల్లి మనసు చాటుకుని, 500 మందికి అన్నదానం చేసారు. పాన్ ఇండియా హీరోగా సత్తా చాటుతున్న చెర్రీ ప్రజంట్ గేమ్ చేంజెర్ మూవీతో తొందర్లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నెక్స్ట్ బుచ్చి బాబు సానా డైరక్షన్ లో ఒక మూవీ కమిట్ అయ్యాడు. ఈ మూవీ RC16 పేరుతొ ప్రారంభం అయ్యింది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. జాన్వీ, చెర్రీ జోడి సూపర్ గా ఉంటుందని ఫాన్స్ సంతోషంగా ఉన్నారు.


రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబో మూవీపై ఇంట్రస్టింగ్ అప్డేట్ ఒకటి సొషల్మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ మూవీలో ఇంకొక హీరోయిన్ కూడా ఉందని, ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచాలని మూవీ యూనిట్ ప్రయత్నించినా, ఆ న్యూస్ బయటికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో మాళవిక మోహనన్ కూడా నటిస్తున్నట్లు టాక్. ఆమె పాత్ర ఎవరూ ఊహించని విధంగా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని అంటున్నారు. మాళవిక మోహనన్ ఇప్పటివరకు కోలీవుడ్ సూపర్ స్టార్స్ సినిమాల్లో నటించింది. తెలుగులో ప్రభాస్ మారుతి కాంబోలో రానున్న 'రాజా సాబ్' లో నటిస్తోంది. ఇప్పుడు చెర్రీ మూవీలో కూడా వాక్సం అందుకుంది. 


భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతున్న ఈ సినిమా క్రీడా నేపథ్యంతో రానున్న సంగతి తెలిసిందే. ప్రజంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకటేష్ సతీష్ ఈ మూవీని  నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కూడా నిర్మాణంలో  భాగస్వాములు కానున్నారు. చాలా రోజుల తరవాత ఏ ఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS