పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ కు సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ ఉంది. పవన్ తనయుడుగా అభిమానులందరూ జూనియర్ పవర్ స్టార్ అని పిలుస్తూ ఉంటారు. ఎప్పుడైనా అకీరా ఫోటో సోషల్ మీడియాలోకి వస్తే అది వైరల్ గా మారుతుంది. తాజాగా అకీరా ఫోటో ఒకటి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.
కొత్తదా లేదా పాతదా తెలియదు గానీ ఈ ఫోటో మాత్రం పవన్ అభిమానులను ఆకర్షిస్తోంది. టాలీవుడ్ హీరో అడవి శేష్ తో కలిసి అకీరా ఈ ఫోటోకు పోజివ్వడం విశేషం. అడవి శేష్ కంటే అకీరా పొడవుగా కనిపిస్తున్నాడు. మెగా ఫ్యామిలీ లోనే అకీరా పొడవైన అబ్బాయి అనే సంగతి తెలిసిందే. ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ తరహాలోనే అకీరా చిరునవ్వులు చిందిస్తూ ఉండడం అందరినీ ఆకట్టుకుంటోంది.
'పంజా' చిత్రంలో పవన్ కళ్యాణ్ తో అడివి శేష్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పవన్ కుటుంబంతో సురేష్ కు మంచి అనుబంధం ఏర్పడింది. అప్పుడప్పుడు అడివి శేష్, అకీరా కలుస్తుంటారట.