కటౌట్ చూస్తే బాలీవుడ్ హీరోని తలపిస్తుంది. టాలెంట్ విషయానికొస్తే, మల్టీ టాలెంటెడ్. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరిస్తూనే డైరెక్షన్, ప్రొడక్షన్, స్క్రిప్ట్ రైటింగ్.. ఇలా ఒక్కటేంటీ చాలా విభాగాల్లో సత్తా చాటేస్తుంటాడు మనోడు. ఎవరో అర్ధమైపోయుంటుంది ఆయనే అడవి శేష్. ఇటీవల 'గూఢచారి' సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని విశేషంగా ఆకర్షించాడు. ఆ ఆకర్షణతోనే 'గూఢచారి 2' కోసం రంగం సిద్ధం చేశాడు. మరోవైపు మహేష్‌బాబు నిర్మాణ సారధ్యంలో, 'మేజర్' చిత్రంలో నటిస్తున్నాడు.
ఈ రెండింటి కన్నా ముందే ఇంకో సినిమానీ లైన్‌లో పెట్టిన సంగతి ఈ మధ్యనే రివీల్ అయ్యింది. ఎప్పుడు స్టార్ట్ చేశాడో తెలీదు కానీ, కామ్‌గా పూర్తి చేసేశాడు. ఆగస్ట్‌లో రిలీజ్‌కి ప్లాన్ చేసేశాడు కూడా. ఆ సినిమానే 'ఎవరు'. వెంకట్ రాంజీ ఈ సినిమాకి దర్శకుడు. ప్రసాద్ వి. పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. లేటెస్ట్‌గా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని అడవిశేష్ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు.
పగిలిన అద్దం, ఆ అద్దంపై కారుతున్న వర్షపు నీరు, రక్తపు ధారలు.. ఓ పోలీస్ వెహికల్.. ఇదీ ఫస్ట్‌లుక్. ఈ లుక్ చూస్తుంటే, ఇదో క్రైమ్ థ్రిల్లర్ అనిపిస్తోంది. కాన్సెప్ట్ బేస్‌డ్ మూవీస్‌కే అడవిశేష్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటాడు. అలా 'ఎవరు' కూడా ఓ కాన్సెప్ట్ బేస్‌డ్ మూవీ అని, చాలా ఇంట్రెస్టింగ్‌గా తెరకెక్కించి ఉంటారనీ తెలుస్తోంది. ఈ సినిమాలో అందాల రెజీనా హీరోయిన్‌గా నటిస్తోంది.