కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ చేసిన లిప్‌లాక్‌ హీరో!

By iQlikMovies - June 01, 2019 - 19:00 PM IST

మరిన్ని వార్తలు

'ఆర్‌ఎక్స్‌ 100'లో హీరోయిన్‌తో వరుస పెట్టి లిప్‌లాకులు లాగించేసి కుర్రోళ్లకు కిర్రాక్‌ తెప్పించిన యంగ్‌ హీరో కార్తికేయ మరో నాలుగు రోజుల్లో అంటే జూన్‌ 6న 'హిప్పీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టి.ఎన్‌.సంతోష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కార్తికేయ బాక్సర్‌గా కనిపించనున్నాడు. బాక్సింగే కాదు, ఇద్దరు ముద్దుగుమ్మలతో ముద్దుల బాక్సింగ్‌ కూడా జోరుగానే చేసేయనున్నాడు. 'ఆర్‌ఎక్స్‌100'లో సింగిల్‌ హీరోయిన్‌తో ముద్దులాటలాడిన ఈ బుల్లోడు, 'హిప్పీ' సినిమాతో ఇద్దరు ముద్దుగ్ములతో ఆన్‌స్క్రీన్‌ రొమాన్స్‌ చేయబోతున్నాడు. తొలి సినిమా డోస్‌కి ఏమాత్రం మించకుండా లిప్‌లాక్స్‌ షేర్‌ చేసుకోనున్నాడు.

 

దిగంగనా సూర్యవన్షీ, జజ్బా సింగ్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి భారీ ఎత్తున ప్రమోషన్స్‌ నిర్వహిస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా కార్తికేయ ఆటిట్యూడ్‌కి విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శకులు ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కార్తికేయ తదుపరి 'గుణ 369' సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి హ్యూజ్‌ రెస్పాన్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత నాని హీరోగా నటిస్తున్న 'గ్యాంగ్‌లీడర్‌' చిత్రంలో కార్తికేయ విలన్‌గా నటిస్తున్నాడు.

 

విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఓ పక్క 'గుణ 369' సినిమాలో హీరోగా నటిస్తూనే, మరోవైపు 'గ్యాంగ్‌లీడర్‌' కోసం యంగ్‌ విలన్‌ అవతారమెత్తాడు కార్తికేయ. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ఈ రెండు సినిమాలూ షూటింగ్స్‌ శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు 'హిప్పీ' ప్రమోషన్స్‌లోనూ యాక్టివ్‌గా కనిపిస్తున్నాడు కార్తికేయ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS