హాలీవుడ్‌కే పరిమితమైన 'జేమ్స్ బాండ్' తరహా పాత్రలు టాలీవుడ్‌లో చాలా అరుదు. అలాంటిది యంగ్ హీరో అడవిశేష్ ఆ తరహా కాన్సెప్ట్‌తో, అదే రకం గెటప్‌తో 'గూఢచారి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సంబంధించి బోలెడన్ని విశేషాలున్నాయి.
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన సుప్రియ దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ సినిమా కోసం ముఖానికి రంగు వేసుకుంది. ఓ ఇంపారెంట్ అండ్ సీరియస్ క్యారెక్టర్‌లో సుప్రియ నటించింది ఈ సినిమాలో. ఆ పాత్రలోని డెప్త్ నచ్చే, ఈ ఆఫర్‌ని అందుకుందట సుప్రియ. ఇక తాజాగా విడుదలైన టీజర్ విషయానికి వస్తే, మైండ్ బ్లోయింగ్ టీజర్ అది. ఓ యంగ్ హీరో సినిమాకి ఈ స్థాయి రిచ్‌నెస్ అంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు.
గన్‌లు, కాస్ట్‌లీ కార్లు, రిచ్ లొకేషన్లు రిచ్ కాస్ట్యూమ్స్ ఇలా ఒక్కటేమిటి చెప్పుకుంటూ పోతే, ఓ స్టార్ హీరో సినిమాకి ఉండాల్సినంత రిచ్‌నెస్ కనిపిస్తోంది. టీజర్‌లో అలా చూపించారు. మరి సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోందో త్వరలోనే తెలిసిపోనుంది. అచ్చంగా హాలీవుడ్ సినిమాని తలపించేలా మధ్యలో హీరో, హీరోయిన్ మధ్య గాఢ చుంబనాలు, యాక్షన్ ఎపిసోడ్స్ తలపిస్తున్నాయి. హీరోయిన్‌గా తెలుగమ్మాయి, 2013 మిస్ ఇండియా శోభితా ధూళిపాళ్ల తెలుగు తెరకు పరిచయమవుతోంది.
ఆగష్టు 3న 'గూఢచారి' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.