నాని నిర్మాతగా తెరకెక్కిన చిత్రం `హిట్`. విశ్వక్ సేన్‌కి మంచి హిట్ అందించింది. దర్శకుడిగా శైలేష్ కొలనుకు తొలి సినిమాతోనే బ్రేక్ వచ్చింది. ఇప్పుడు `హిట్`ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఆ వెంటనే.. హిట్ సినిమాకి సీక్వెల్ ఉంటుంది. అయితే.. ఈ సీక్వెల్ లో.. విశ్వక్‌సేన్ ఉండడని టాక్. అతని స్థానంలో అడవిశేష్ కనిపించనున్నాడని ప్రచారం సాగుతోంది. థ్రిల్లర్ జోనర్ చిత్రాలకు అడవిశేష్ మంచి ఆప్షన్. నానితో తనకి మంచి అనుబంధం ఉంది. అందుకే.. అడవిశేష్ ని ఎంపిక చేసుకున్నారని సమాచారం.
నిజానికి హిట్ సినిమాల సీక్వెల్ లో ఎవరు మారినా, హీరోలు మాత్రం మారరు. `హిట్` ఫార్ములాని ఎవరూ వదులుకోరు. కానీ విశ్వక్ సేన్ మాత్రం ఈ సీక్వెల్ లో నటించడానికి ఏమాత్రం ఇష్టపడలేదని తెలుస్తోంది. ఒకే జోనర్‌లో సినిమాలు చేయడం తనకిష్టం లేదని, ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడట. పైగా.. విశ్వక్‌సేన్ ఫుల్ బిజీలో ఉన్నాడు. అందుకే.. తను ఈ సినిమా చేయడం లేదని తెలుస్తోంది.