అప్పుడు కమల్‌ హాసన్‌ ఇప్పుడు విక్రమ్‌..!

By Inkmantra - February 29, 2020 - 17:00 PM IST

మరిన్ని వార్తలు

విలక్షణ నటుడిగా, సినిమా కోసం, పాత్ర కోసం తన శరీరాన్ని ఎంత కష్టపెట్టడానికైనా సిద్ధపడే హీరోల జాబితాలో ముందుంటాడు నటుడు విక్రమ్‌. శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘ఐ’ సినిమా కోసం గతంలో విక్రమ్‌ పడిన కష్టం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే ‘అపరిచితుడు’, తదితర చిత్రాలు నటుడిగా అతనిలోని గొప్పతనాన్ని బయటికి తీసుకొచ్చాయి. ఇకపోతే తాజాగా ఆయన ‘కోబ్రా’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఏడు విభిన్న రకాల గెటప్స్‌లో కనిపించి మెస్మరైజ్‌ చేస్తున్నాడు. ‘దశావతారం’ సినిమాలో కమల్‌ హాసన్‌ 9 రకాల గెటప్స్‌ ధరించి ఫిదా చేశారు. ఆ రికార్డుని ఇంతవరకూ ఎవరూ బ్రేక్‌ చేయలేదు.

 

కానీ, అంతకు దగ్గరగా విక్రమ్‌ ఆ రికార్డు దిశగా దూసుకొచ్చాడు. ఏడు రకాల భిన్న పాత్రల్లో, విభిన్న ఎక్స్‌ప్రెషన్స్‌తో కనిపిస్తున్న ‘కోబ్రా’ ఫస్ట్‌లుక్‌ని చిత్ర యూనిట్‌ తాజాగా రిలీజ్‌ చేసింది. ఈ ఫస్ట్‌లుక్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ మధ్య విక్రమ్‌కి సరైన హిట్‌ పడలేదు. కానీ, ‘కోబ్రా’తో మ్యాజిక్‌ చేయబోతున్నాడనిపిస్తోంది. టైటిల్‌ని బట్టి చూస్తే ఇదో పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ప్యాక్డ్‌ మూవీగా తోస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ సినిమాకి అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. సమ్మర్‌లో గ్రాండ్‌ రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS