చిరు కొరటాల మల్టీ స్టారర్‌ మూవీనా?

మరిన్ని వార్తలు

కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాకి సంబంధించి సరికొత్త గాసిప్స్‌ చక్కర్లు కొడుతున్నాయి. ఒకదానిపై ఒకటిగా పోటీ పడుతూ సర్య్యులేట్‌ అవుతున్న ఈ గాసిప్స్‌ సినిమాపై విపరీతమైన హైప్‌ పెంచేస్తున్నాయి. ఇంతకీ ఏంటా గాసిప్స్‌.? అంటే, ఈ సినిమాలో సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు గెస్ట్‌ రోల్‌ పోషించనున్నారనీ. మొన్నటి వరకూ ఆ పాత్రలో చరణ్‌ కనిపించనున్నాడని టాక్‌ వచ్చింది. అయితే, ఆ తర్వాత అది అల్లు అర్జున్‌కి షిఫ్ట్‌ అయ్యింది.

 

లేటెస్ట్‌గా మహేష్‌బాబు అంటూ గుప్పు గుప్పుమంటోంది. అయితే, ఈ సారి మహేష్‌ని దాదాపు ఫిక్స్‌ చేసేసినట్లు తెలుస్తోంది. ఏకంగా మహేష్‌, చిరంజీవి కలిసి ఉన్న ఓ ఫ్యాన్‌ మేడ్‌ పోస్టర్‌ కూడా నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ‘గోవింద ఆచార్య’ అనే టైటిల్‌తో ఫ్యాన్స్‌ రూపొందించిన ఈ పోస్టర్‌ నిజమైన పోస్టర్‌ని తలపిస్తోంది. ఈ పోస్టర్‌కి నెట్టింట్లో ఓ రేంజ్‌ రెస్పాన్స్‌ వచ్చేస్తోంది. ఇదిలా ఉంటే, మహేష్‌బాబు ఈ సినిమా కోసం నెల రోజులు డేట్స్‌ కూడా ఇచ్చేశాడని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, 30 రోజులకు 30 కోట్లు రెమ్యునరేషన్‌ కూడా తీసుకుంటున్నాడనీ మాట్లాడుకుంటున్నారు. మరోవైపు, చిరంజీవి సినిమాలో నటించడం ఓ గొప్ప అచీవ్‌మెంట్‌. అందులోనూ మహేష్‌కి మంచి మిత్రుడైన రామ్‌ చరణ్‌ ఈ సినిమాకి నిర్మాత కావడంతో, జస్ట్‌ ఫ్రెండ్‌షిప్‌లో భాగంగానే మహేష్‌ ఈ సినిమాలో నటిస్తున్నాడని మరికొందరు అంటున్నారు.

 

అయితే, ‘ఆలు లేదు చూలు లేదు, అల్లుడి పేరు అదేదో..’ అన్నట్లుగా, ఇంతకీ ఈ పాత్రకు మహేష్‌ ఫిక్సయ్యాడో లేదో కానీ, ఆయన క్యారెక్టర్‌ ఇదీ అంటూ, రెమ్యునరేష్‌ ఇంతా.. అంటూ పుట్టుకొస్తున్న ఈ గాసిప్స్‌, ఇటు మహేష్‌ ఫ్యాన్స్‌కీ, అటు మెగా ఫ్యాన్స్‌నీ మస్త్‌ ఎంటర్‌టైన్‌ చేస్తున్నాయిలే. ఏదేమైనా ఈ గాసిప్స్‌ నిజమే అయితే ఇదో పెద్ద మల్టీ స్టారర్‌గా పరిగణించాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS