సోషల్ మీడియాలో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించిన హీరోల్లో అల్లు అర్జున్ మొదటి స్థానంలో ఉంటాడు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాలలో... బన్నీ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. కేరళలోనూ బన్నీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బన్నీ స్టైల్ ని, డాన్స్‌నీ మిగిలిన భాషా ప్రేక్షకులూ ఇష్టపడతారు. అందుకే బన్నీ సోషల్ మీడియా కింగ్ అయిపోయాడు. తాజాగా ఇన్‌స్ట్రాలో 12 మిలియన్ ఫాలోవర్స్‌ని సంపాదించుకున్నాడు.
ఇటీవలే... రౌడీ `విజయ్ దేవరకొండ` ఇన్ స్ట్రాలో ఈ మైలురాయిని అందుకుని... సౌత్ ఇండియాలో ఆ ఘనత సాధించిన తొలి హీరో అయ్యాడు. ఇప్పుడు బన్నీ కూడా ఆ మైలు రాయిని చేరుకున్నాడు. ఈ విషయంలో బన్నీ, విజయ్‌ల మధ్య మంచి పోటీ నెలకొందని చెప్పొచ్చు. ఓరకంగా చెప్పాలంటే.. బన్నీకంటే.. విజయ్ జూనియర్. అయినా సరే, ఈ విషయంలో బన్నీని దాటేస్తున్నాడు. బన్నీ.. విజయ్‌ని వెంబడిస్తున్నాడు. ఈ పోటీ.. బాక్సాఫీసు దగ్గర కూడా మొదలైతే.. రసవత్తరంగానే ఉంటుంది.