తొలి విజయం అందుకోవడానికి ఆపసోపాలు పడుతూనే ఉన్నాడు అఖిల్. ఇప్పటి వరకూ మూడు సినిమాలు చేస్తే మూడూ ఫట్టే. ఇప్పుడు తన ఆశలన్నీ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`పైనే ఉన్నాయి. ఆ తరవాత కూడా ఫ్లాట్ ఫామ్ సరిగానే వేసుకున్నాడు అఖిల్. ఆ తరవాత సినిమాని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. పరిస్థితులు అనుకూలించలేదు గానీ, ఈ పాటికే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లాల్సింది. అయితే ఈలోగా సురేందర్ రెడ్డి స్క్రిప్టుని పక్కా గా రాసుకుంటున్నాడు. ఇతర నటీనటుల విషయంలోనూ ఓ అభిప్రాయానికి వచ్చినట్టు టాక్.
ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందట. ఆ పాత్ర కోసం కన్నడ స్టార్ ఉపేంద్రని ఎంచుకునే అవకాశాలున్నట్టు టాక్. `సన్నాఫ్ సత్యమూర్తి`లో ఉపేంద్ర ప్రతినాయకుడిగా కనిపించిన సంగతి తెలిసిందే. అందులో ఉపేంద్ర నటనకు మంచి మార్కులు పడ్డాయి. సురేందర్ రెడ్డి - అఖిల్ సినిమా పాన్ ఇండియా లెవిల్ లో తెరకెక్కుతోంది కాబట్టి, కన్నడ నుంచి ప్రతినాయకుడ్ని ఎంచుకుంటే బాగుంటుందని టీమ్ భావిస్తోంది. ఈ విషయమై ఉపేంద్రతో సంప్రదింపులు జరుపుతోంది టీమ్. త్వరలోనే ఈ విషయంలో ఓ క్లారిటీ రావొచ్చు.