తెలుగులో ఘన విజయం సాధించిన చిత్రం `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`. నవీన్ పోలిశెట్టి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి స్వరూప్ దర్శకుడు. తెలుగులో విమర్శకుల ప్రశంసలతో పాటు, మంచి లాభాల్నీ అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం తమిళంలో రీమేక్ అవ్వబోతోంది. సంతానం కథానాయకుడిగా నటిస్తారు. తెలుగు నిర్మాతలే ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారని తెలుస్తోంది.
దర్శకుడు ఎవర్నది క్లారిటీ రావాల్సివుంది. సంతానం తమిళనాట పాపులర్ హాస్యనటుడు. తిరుగులేని స్టార్. హీరోగానూ కొన్ని సినిమాలు చేశాడు. కామెడీ టైమింగ్‌లో సంతానానికి పోటీనే లేదు. ఈ సినిమాకి కావల్సింది కూడా అదే. మరి ఏజెంట్ గా ఏమాత్రం నవ్విస్తాడో చూడాలి.