బన్నీ స్పెషల్ ట్రీట్ వచ్చేసింది. 'అల వైకుంఠపురములో' సినిమా నుండి మూడో పాటనీ వదిలేశారు. ఈ పాటతో సినిమాపై క్రేజ్‌ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లిపోయారు. అదేంటో, బన్నీ చెప్పినదానికంటే ఎక్కువే చేసి చూపిస్తున్నాడు ఈ సినిమాతో. సర్ప్రైజ్ అలా ఉండబోతోంది.. ఇలా ఉండబోతోంది.. అంటూ బిల్డప్ ఇచ్చి తీరా రిలీజ్ అయ్యాకా.. తుస్సుమనిందిలే అనేందుకు లేదు. అంతకు మించి సర్ప్రైజ్ ఇస్తున్నాడు బన్నీ. ఇకపోతే, తాజా సర్ప్రైజ్ తెలిసిందే. 'ఓఎమ్‌జీ డాడీ..' అనే సాంగ్ రిలీజ్ కానుంది అని ప్రచారం చేశారు. ఆ సాంగ్ వీడియోలో అల్లు అయాన్ కనిపిస్తాడని కూడా చెప్పారు.
అయితే, అల్లు అయాన్ ఏదో జస్ట్ అలా కనిపిస్తాడేమోలే అనుకుంటే, రిలీజయ్యాక వీడియో నిజంగానే షాక్ ఇచ్చింది. ఈ సాంగ్ వీడియోలో సన్నాఫ్ బన్నీ అల్లు అయాన్ అప్పియరెన్స్ సూపర్బ్. పర్ఫామెన్స్ అదరగొట్టేశాడంతే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొడుకు, స్టైల్ ఇరగదీసేశాడు. స్టెప్పులు కూడా వేసేశాడు. ఇంకేముంది సన్నాఫ్ స్టైలిష్ స్టార్ అనిపించుకున్నాడు. ఈ సాంగ్‌లో సింగిల్ సర్ప్రైజే కాదండోయ్ డబుల్ సర్ప్రైజ్. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా కనిపించింది. స్నేహా రెడ్డి కనిపించలేదు. కానీ, టోటల్‌గా అల్లు అర్జున్ ఫ్యామిలీ సాంగ్ అన్న మాట. చిల్డ్రన్స్ డే సందర్భంగా అల్లు అర్జున్ ట్రీట్ అదిరిపోయిందంతే.