రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆసుపత్రి పాలయ్యారు. ఆయన హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో చేరారు. మూడు రోజుల నుంచీ ఆయన ఆసుపత్రిలోనే ఉన్నారని సమాచారం. ఆయన జ్వరంతో బాధపడుతున్నారని సన్నిహిత వర్గాలు చెప్పాయి. అయితే నెలకోసారి జనరల్ చెకప్‌కి రావడం, ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడం కృష్ణంరాజుకి అలవాటే అని తెలుస్తోంది. పైగా ఆయన నిమోనియోతో బాధపడుతున్నారని, అందుకు సంబంధించిన చికిత్సే ప్రస్తుతం జరుగుతోందని సమాచారం అందుతోంది. ఆయన ఆరోగ్యం గురించి బెంగ పడాల్సిన పనిలేదని, ఆయన త్వరలోనే కోలుకుని డిశ్చార్జ్ అవుతారని పీఆర్ టీమ్ తెలిపింది. ప్రభాస్ కొత్త సినిమా 'జాన్' గోపీకృష్ణ బ్యానర్‌లోనే తెరకెక్కుతోంది.