సినిమా ఫలితం మొదటి రోజే డిసైడ్ అయిపోవడం, డిజాస్టర్ టాక్ రావడం సంగతి ఎలా ఉన్నా, 'అజ్ఞాతవాసి' సినిమా ఫస్ట్ డే రికార్డులు మాత్రం ఓ రేంజ్‌లో కొల్లగొట్టేసింది. ప్రీమియర్స్‌తో నాన్ 'బాహుబలి-2' రికార్డుల్ని యూఎస్‌తో తుడిచిపెట్టేసింది 'అజ్ఞాతవాసి'. రెండో రోజు మాత్రం ఇండియాలో 'అజ్ఞాతవాసి' పరిస్థితి దారుణంగా మారిందన్న ట్రేడ్ రిపోర్టులు, మూడో రోజు కూడా అదే డల్‌నెస్‌తో కొనసాగాయి. అయితే ఆ తర్వాత మళ్ళీ కొంత మేర పండగ కళ 'అజ్ఞాతవాసి'ని ఆదుకుందనే చెప్పాలి.
ఇంకో వైపున ఓవర్‌సీస్‌ల 2 మిలియన్ క్లబ్‌లోకి చేరేందుకు 'అజ్ఞాతవాసి' పరుగులు పెడుతోంది. నిన్నటికే 1.9 మిలియన్ దాటేసింది 'అజ్ఞాతవాసి'. 2 మిలియిన్ క్లబ్‌లో చేరడం ఖాయమైపోవడంతో ఇంతటి డిజాస్టర్ టాక్‌తోనూ ఈ మైలు రాయి చేరుకున్న సినిమాగా 'అజ్ఞాతవాసి' వార్తల్లోకెక్కినట్లవుతుంది. ఇదిలా ఉండగా సంక్రాంతి సీజన్ 'అజ్ఞాతవాసి' నష్టాల్ని కొంతవరకు తగ్గించే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ పండింతులు కొంత మేర సానుకూల సంకేతాలు పంపుతున్నారు. వారి అంచనాలు నిజమౌతాయా? లేదా? అనేది కూడా రెండ్రోజుల్లో తేలిపోతుంది.
2017 సంక్రాంతికి వచ్చిన అన్ని సినిమాలూ మంచి విజయాల్ని అందుకోగా, 2018 సంక్రాంతి మాత్రం సినీ పరిశ్రమలో ఆశించిన ఆనందాన్ని నింపలేకపోయింది. జనవరి 26 నుంచి మళ్ళీ సినిమాల జాతర మొదలు కానుంది. ఫిబ్రవరిలో అయితే సినీ పరిశ్రమకు ఇంకో సంక్రాంతి అనేలా పెద్ద సంఖ్యలో సినిమాలు విడుదలవుతున్నాయి. వాటిల్లో చాలావరకు భారీ అంచనాలతో విడుదలవుతున్నవే. సంక్రాంతి నిరాశని పక్కన పెట్టి, జనవరి ఎండింగ్, ఆ తర్వాత వచ్చే ఫిబ్రవరి పట్ల సినీ పరిశ్రమ ఎన్నో ఆశలు పెట్టకుంది. ఆ తర్వాత మార్చ్, ఏప్రిల్ మళ్ళీ సినిమాల జాతరే, అందునా పెద్ద సినిమాల జాతర ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది.