ఈ సంవత్సరం సంక్రాంతి సినిమాల హడావిడి ముగిసింది. రెండు పెద్ద చిత్రాలు, ఒక చిన్న చిత్రం అలాగే ఒక డబ్బింగ్ చిత్రం ఈ సంవత్సరపు సంక్రాంతి బరిలో నిలిచాయి.
ముందుగా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన అజ్ఞాతవాసి, జై సింహ చిత్రాలు రెండు బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలపడడమే గాక ఈ 2018కి సంబంధించిన ఫ్లాప్ జాబితాలో ఈ రెండు చేరిపోయాయి. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లు ఇద్దరూ ఈ సారి నిరాశపరిచారు అనే చెప్పాలి.
ఇక ఈ రెండు పెద్ద చిత్రాల నడుమ నిన్న విడుదలైన రాజ్ తరుణ్ రంగుల రాట్నం మొదటి షో నుండే యావరేజ్ టాక్ అందుకుంది. పెద్ద చిత్రాలు రెండు అంచనాలు తలకిందులు అయి ఫ్లాప్ అవ్వగా ఈ చిత్రం హిట్ కొట్టి సంచలనం సృష్టిస్తుంది అని అందరూ అనుకోగా ఈ సినిమా హిట్ కి ఆమడ దూరంలో నిలిచిపోయింది.
ఇక ఆఖరిగా డబ్బింగ్ చిత్రాల జాబితాలో ఈ సంవత్సరపు తొలి ఎంట్రీ అయిన సూర్య గ్యాంగ్ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద వెలవెలబోయింది. హిందీ చిత్రం స్పెషల్ 26కి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం ఫ్లాప్ అవ్వడం ఒకరకంగా ఆశ్చర్యమే. అయితే ఈ సినిమాకి దర్శకుడు మార్చిన క్లైమాక్స్ అలాగే తెలుగు నేటివిటీ అడ్డంకులుగా మారాయి.
మొత్తానికి ఈ సంవత్సరపు సంక్రాంతి, సినిమాల పరంగా సైలెంట్ గా గడిచిపోయింది అనే చెప్పొచ్చు. ఇది ఈ వారం www.iQlikmovies.com టాక్ అఫ్ ది వీక్.