పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'అజ్ఞాతవాసి' గురించి లేటెస్ట్‌గా ఓ న్యూస్ బయటికి వచ్చింది. మెగాస్టార్ ఫ్యామిలీ కోసం స్పెషల్ ప్రీమియర్ షోని వేయనున్నారనీ టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఈ షో కేవలం మెగా ఫ్యామిలీ మెంబర్స్ కోసమేనట. సినిమా విడుదలకు సరిగ్గా రెండు రోజుల ముందుగా ఈ షోని ప్రదర్శించనున్నారట.
ఈ హాట్ న్యూస్‌తో, సినిమా ముందుగా చూసి చిరంజీవి సినిమాపై తన అభిప్రాయాన్ని చెబుతారనీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఈ వార్త నిజమే అనుకుంటే, ఈ సినిమాకి సంబంధించి ఇదో ప్రత్యేకతగానే భావించాలి. త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి తెరకెక్కుతోన్న సినిమా 'అజ్ఞాతవాసి'. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కనీ వినీ ఎరుగని స్థాయిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. యంగ్ డైరెక్టర్ అనిరుధ్ మ్యూజిక్‌లో వచ్చిన ఈ సినిమా ఆడియో యూత్‌ని ఉర్రూతలూగిస్తోంది.
అన్ని పాటలూ ఒకెత్తు. న్యూ ఇయర్ సందర్భంగా విడుదలైన 'కొడకా కోటేశ్వరరావు..' సాంగ్ మరో ఎత్తు. న్యూ ఇయర్ సందర్భంగా ఈ సాంగ్‌ని సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లా విడుదల చేశారు. సర్‌ప్రైజ్ అంటే సర్‌ప్రైజే. ఓ రేంజ్‌లో ఉందీ పాట. ఈ పాటను పవన్ కళ్యాణ్ స్వయంగా ఆలపించారన్న సంగతి తెలిసిందే. 'అత్తారింటికి దారేది' సినిమాలో 'కాటమరాయుడా..' సాంగ్ తెచ్చిన క్రేజ్ ఏ పాటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. దాన్ని మించిన కిక్ ఈ సాంగ్ ఇస్తుందనడం నిస్సందేహం. అనూ ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ నటి కుష్బూ, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
జనవరి 10న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా విడుదల కానుంది.