సత్యదేవ్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. వరుసగా తనకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం `గాడ్సే` అని సినిమాలో నటిస్తున్నాడు సత్యదేవ్. గోపీగణేష్ ఈ చిత్రానికి దర్శకుడు. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో.. `బ్లఫ్ మాస్టర్` సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పడు `గాడ్సే` ప్రీ ప్రొడక్షన్ పనులు చక చక సాగుతున్నాయి. ఇందులో కథానాయికగా పలువురి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి.
పాయల్ రాజ్ పుత్ ని కథానాయికగా ఎంచుకుంటారని అనుకున్నారు. ఇప్పుడు ఐశ్వర్య లక్ష్మి అనే మలయాళ భామని ఎంచుకున్నారు. ఐశ్వర్యకి ఇదే తొలి తెలుగు సినిమా. ఇటీవల ఆమెపై ఫొటో షూట్ చేసినట్టు, చిత్రబృందం సంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం. త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయి.