కరోనా మహమ్మారి ప్రపంచాన్నంతటినీ తన గుప్పిట్లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కోవిడ్ - 19 కు సాధారణ వ్యక్తులు, సెలబ్రిటీలు అనే తేడా లేదు. ఈమధ్య ప్రముఖ సెలబ్రిటీ అయిన అమితాబచ్చన్, ఆయన కుటుంబ సభ్యులు కోవిడ్ - 19 బారిన పడిన సంగతి తెలిసిందే. అమితాబ్ తో పాటు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, ఆరాధ్య బచ్చన్ కు కోవిడ్ -19 సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో అభిమానులు ఎంతో కలత చెందారు. అమితాబ్ బచ్చన్ కుటుంబ సభ్యులు అందరూ ముంబైలోని నానావతి హాస్పిటల్ లో వైద్యం చేయించుకుంటున్నారు.
అయితే తాజాగా ఐశ్వర్యరాయ్, ఆరాధ్య ఇద్దరికీ టెస్ట్ రిజల్ట్ నెగిటివ్ వచ్చింది. ఇద్దరిని హాస్పిటల్ నుంచి ఇంటికి పంపారు. దీంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. తనపై తన కుటుంబ సభ్యుల పై అభిమానులు, శ్రేయోభిలాషులు కురిపించిన ప్రేమకు, అభిమానానికి ఐశ్వర్య చాలా సంతోషించారు. అందరికీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఒక అందమైన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసి తమపై అభిమానాన్ని కురిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
ఫోటోలో ఐశ్వర్య తన చేతులతో నమస్తే, ఆరాధ్య చేతులతో ఒక లవ్ సింబల్ పెట్టి ఫోటో తీసుకున్నారు. అభిమానులకు శ్రేయోభిలాషులకు ఈ విధంగా ఐశ్వర్య, ఆరాధ్య కృతజ్ఞతలు తెలపడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోకి స్పందించిన చాలామంది నెటిజన్లు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కూడా త్వరలోనే కోలుకొని క్షేమంగా ఇంటికి రావాలని ఆకాంక్షించారు.