చిరంజీవి సినిమాల్లో యాక్టివ్ అవడంతో, ఆయన సరసన జత కట్టే ముద్దుగుమ్మల కోసం టాలీవుడ్ వేట మొదలైంది. రీ ఎంట్రీలో తొలి సినిమా కోసం ఆ భామ.. ఈ భామ అంటూ వెతికి వెతికి మొత్తానికి చందమామని ఫిక్స్ చేశారు. ఏదో అలా అది అయ్యిందనుకుంటే, తదుపరి చిత్రం 'సైరా నరసింహారెడ్డి'లో నయనతారను ఎంచుకున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధమవుతోంది.
ఇక తాజా చిత్రం కోసం కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ నటించబోతున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో మెగాస్టార్‌తో జత కట్టబోయే ముద్దుగుమ్మ ఎవరనే విషయంపై హాట్ హట్‌గా చర్చ సాగుతోంది. ఫ్యాన్స్ ఒపీనియన్ ప్రకారం చిరు పక్కన కాస్త ముదురు ఫీచర్స్ ఉన్న హీరోయిన్ అయితేనే బాగుంటుందని భావిస్తున్నారట. 'ఖైదీ'లో కాజల్ అంతగా సెట్ కాలేదనే విమర్శలున్నాయి. ఇక 'సైరా' చారిత్రాత్మక చిత్రం కాబట్టి, అయినా, నయనతార చిరుకి జోడీగా సెట్టయ్యింది కాబట్టి, నో కామెంట్స్. కానీ, కొరటాల సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ అనే ప్రచారం జరుగుతోంది. డాన్సులూ, ఫైట్లూ.. ఇలా మాస్ ఎలిమెంట్స్ చాలా ఉండబోతున్నాయట ఈ సినిమాలో. సో చిరుతో జత కట్టబోయే హీరోయిన్‌పై కూసింత దృష్టి బాగానే పెట్టాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారట. ఆ దిశగా బాలీవుడ్ భామ ఐశ్వర్యారాయ్ పేరు తాజాగా తెరపైకి వచ్చింది.
ఐశ్వర్యా రాయ్, చిరు జోడీ బాగానే ఉంటుందని ఫ్యాన్స్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఇక ఫైనల్ చేయడమే తరువాయి. మరోవైపు అనుష్క, త్రిష వంటి సీనియర్ హీరోయిన్ల పేర్లు కూడా లిస్టులో ఉన్నాయి. కానీ, వారు తమ తమ ప్రాజెక్టులతో ప్రస్తుతం బిజీ షెడ్యూల్స్‌తో ఉండడం వల్ల ఛాన్స్ ఐష్‌కే దక్కేలా ఉంది. అప్పుడెప్పుడో తెలుగులో 'రావోయి చందమామ' సినిమాలో నాగార్జునతో ఐటెం సాంగ్‌లో మెరిసింది. ఒకవేళ ఈ గాసిప్ నిజమైతే, మళ్లీ ఇన్నాళ్లకు చిరు పుణ్యమా అని టాలీవుడ్‌లో ఐష్ తళుకులు చూడొచ్చన్న మాట.