'బాహుబలి' సినిమాలో నటించి ప్రబాస్ యూనివర్సల్ హీరో అయిపోయాడు. అయితే అభిమానలందరిలోనూ ప్రబాస్ పెళ్లి ్ల గురించిన టెన్షన్ అలాగే ఉండిపోయింది. 'బాహుబలి' సినిమా కోసం తన పెళ్లి వాయిదా వేసుకుంటూ వస్తున్నాడనీ, ఈ సినిమా పూర్తి కాగానే ప్రబాస్ పెళ్లి వార్త చెబుతారనీ అభిమానులు ఆశించారు. అయితే ప్రబాస్ మాత్రం తన పెళ్లి ఊసే ఎత్తడం లేదు. సరికదా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో ప్రబాస్ ఓ బాంబ్ పేల్చారు. అమ్మాయిలు ఏమాత్రం బాధ పడాల్సిన అవసరం లేదనీ, తన డార్లింగ్ తన మనసును ఎవ్వరికీ ఇవ్వలేదనీ, ఇప్పట్లో పెళ్లి ఆలోచన కూడా చేయననీ చెప్పడం, ఒకింత ప్రబాస్ లేడీ ఫ్యాన్స్‌కి నచ్చిన మాటే అయినా కానీ, జెంట్ ఫ్యాన్స్ మాత్రం అయ్యో తమ అభిమాన హీరో పెళ్లి వార్త ఎప్పటికి వింటామో అన్నట్లుగా ఆందోళన చెందుతున్నారు. మరో పక్క ప్రబాస్ సినిమాల జోరు పెంచాడు. 'బాహుబలి' తర్వాత ప్రబాస్ 'సాహో' చిత్రంలో నటిస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో అత్యంత సాంకేతిక టెక్నాలజీతో ఈ సినిమా రూపొందుతోంది. యువీ క్రియేషన్స్ సంస్ధ ఈ సినిమాని రూపొందిస్తోంది. మరో పక్క రియల్ లైఫ్‌లోనూ ప్రబాస్‌కి జోడీ కదరనట్లే. రీల్ లైఫ్‌లోనూ మన ఆరడుగుల అందగాడికి జోడీ కుదరడం లేదు. ఇంతవరకూ ఈ సినిమాలో ప్రబాస్‌తో జత కట్టే ముద్దుగుమ్మ ఎవరనేది సస్పెన్స్‌గానే ఉంది.