సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె, హీరో ధనుష్ సతీమణి ఐశ్వర్య పేరు దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. ఐశ్వర్య ప్రస్తుతం తన భర్త సొంత ప్రొడక్షన్ హౌస్ వుండర్ బార్ ఫిలిమ్స్ కు సంబంధించిన బాధ్యతలు చూసుకుంటున్నారు. తాజాగా ఐశ్వర్య ఓ యోగా ట్రైనర్ గా పేరు తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారట.
ఓ యోగా ఇన్స్టి ట్యూట్ స్థాపించాలని, దాన్నో బ్రాండ్ గా మలిచే ప్లానింగ్ లో ఉన్నారట. ఈ దిశగా చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా మొదటగా ఆన్లైన్ క్లాసులను మొదలుపెడతారట. ఐశ్వర్య గత కొంత కాలంగా తను యోగా ప్రాక్టిస్ చేస్తున్న ఫోటోలను ఇన్స్టా ద్వారా పంచుకుంటూ ఉన్నారు. దివా యోగా, సర్వా యోగా స్టూడియోలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తున్నారు. మరి తన యోగా బ్రాండుకు ఏం పేరు పెడతారో వేచి చూడాలి.
సూపర్ స్టార్ కుమార్తె కాబట్టి సూపర్ యోగా అని పేరు పెడితే సూపర్ గా ఉంటుందేమో! ఏదేమైనా సెలబ్రిటీలు యోగా ద్వారా, ఫిట్ గా ఉండడం, ఆరోగ్యం గురించి అందరికీ అవహగాన కల్పించడం మంచి విషయం. సాధారణ ప్రజలకు ఇవన్నీ ప్రేరణగా నిలుస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.