రజినీకాంత్ భార్య నిర్వహిస్తున్న స్కూల్ భవనం విషయంలో తలెత్తిన వివాదం కొత్త మలుపు తీసుకుంది. రజిని కుటుంబానికి వ్యతిరేకంగా ఈ మధ్యనే కోర్టు తీర్పు ఇవ్వడం దానితో సదరు భవనానికి సీల్ వేయడం వంటి విషయాలు విదితమే.
ఇక ఇదే విషయం పైన రజినీకాంత్ కుటుంబం న్యాయ పోరాటానికి సిద్ధం అయింది. రజిని పెద్ద కూతురు ఐశ్వర్య నిన్న చెన్నై హైకోర్టులో ఈ విషయమై పరువునష్టం దావా వేశారు, ఈ సంఘటన వల్ల తమకి తమ పాఠశాల జరిగిన నష్టానికి సుమారు రూ 6 కోట్ల మేర తమకి భవన యజమాని నుండి ఇప్పించవలసిందిగా కోర్టుని కోరారు.
2005లోనే సదరు యజమాని దగ్గర ఈ భవనానికి సంబందించిన లీజ్ అగ్రిమెంట్ చేయించడం జరిగిందని, ఆఖరి సారిగా గత మే నెలలోనే తాము అద్దె చెల్లించినట్టు కోర్టుకి వివరించారు.
ఆయన చేసిన అసత్య ఆరోపణల వాళ్ళ తమకి జరిగిన నష్టానికి భవన యజమానే అని చెబుతూ తమకి నష్టపరిహారం చెల్లించేలా చూడమంటూ కోర్టుని అభ్యర్దించారు.