అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఎట్టకేలకు మెగాస్టార్ 151 వ సినిమా పేరు ఖరారైంది. చిరు బర్త్ డే సందర్భంగా ఇవాళ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ లను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగో ను డైరెక్టర్ రాజమౌళి విడుదల చేసారు.
అయితే ఇదివరకు అనుకున్న ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కాకుండా 'సైరా నరసింహారెడ్డి' గా పేరు మార్చటం జరిగింది. ఈ సినిమా టైటిల్ మార్చటం పై ఉయ్యాలవాడ వారసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం స్వాతంత్రానికి ముందే ఎంతో పోరాటం చేసిన ఈ వీరుడి గాధను తెరకెక్కిస్తూ 'ఉయ్యాలవాడ' పేరును టైటిల్ గా పెట్టకుండా మరొక పేరు టైటిల్ గా పెట్టడం పై కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
'సైరా నరసింహారెడ్డి' సినిమాలో చిరు సరసన హీరోయిన్ గా నయనతార నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దీనికి నిర్మాతగా రామ్ చరణ్, దర్శకుడిగా సురేందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టగా, ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.