మహేష్ బాబు చాలా దుఃఖంలో వున్నారు. నెలల వ్యవధిలో ముగ్గురు కుటుంబ సభ్యులని పోగొట్టుకున్నారు. తండ్రి కృష్ణ వెళ్ళిపోవడంతో పెద్ద దిక్కుని కోల్పోయినట్లయింది. నిన్నటి నుండి మహేష్ మొహంలో ఘాడమైన విచారం, కన్నీళ్లు. ఈ విషయంలో మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా ఆవేదన చెందారు. అయితే బాలకృష్ణ రూపంలో మహేష్ ఫ్యాన్స్ కి పెద్ద ఉపసమనం దొరికింది.
బాలయ్య ఈ రోజు కృష్ణకి నివాళి అర్పించడానికి వెళ్లారు. మహేష్ బాబుని పరామర్శించారు. మహేష్ ని విచారం నుండి బయటికి తీసుకురావాలని అనుకున్నారేమో.. ఒక చిన్న నవ్వుతూ ఎదో అన్నారు. వెంటనే మహేష్ బాబు కాస్త నవ్వారు. పక్కనే వున్న గౌతమ్ కూడా నవ్వాడు. మహేష్ నవ్విన విజువల్ ఫ్యాన్స్ ని చాలా సంతోషాన్ని ఇచ్చింది.
ఇప్పుడు మీమ్స్, ట్వీట్స్ రూపంలో బాలయ్య థాంక్స్ చెబుతున్నారు మహేష్ ఫ్యాన్స్. ''.దండాలయ్యా.. బాలయ్య.. మా మహేష్ అన్నని నవ్వించినందుకు థాంక్స్'' అంటూ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు.