ఆర్.ఎక్స్ 100... ఇండ్రస్ఠ్రీని ఓ కుదుపు కుదిపేసిన సినిమా. ఈ సినిమాలో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ లాంటి వాళ్లు వెలుగులోకి వచ్చారు. అజయ్ భూపతి కి అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే ఆ తరవాత అజయ్ భూపతి మరో సినిమా చేయలేకపోయాడు. `మహా సముద్రం` అనే స్క్రిప్టు రాసుకున్నా, హీరోల చుట్టూ తిరిగి, వాళ్లని ఒప్పించే సరికి పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. రేపో - మాపో ఈ సినిమా పట్టాలెక్కబోతోంది అనుకుంటే లాక్ డౌన్ వచ్చి పడిపోయింది. అయితే ఈ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్నాడు అజయ్.
ఇక మీదట సినిమాల విషయంలో జాప్యం చేయకూడదని గ్రహించాడు. అందుకే తన మూడో సినిమాకి సంబంధించిన స్క్రిప్టు వర్క్ కూడా మొదలెట్టేశాడు. `ఆర్.ఎక్స్ 100`కి సీక్వెల్ చేయాలన్నది అజయ్ భూపతి ప్లాన్. అందుకు తగిన కథ కూడా దొరికిందట. ఈసారి కూడా ప్రేమకథనే చెప్పబోతున్నాడు అజయ్. ఈ సినిమాలో కార్తికేయనే హీరో. మరి హీరోయిన్ ఎవరన్నది తేలాల్సివుంది. మహా సముద్రం అయిపోయాక ఈ సినిమానే పట్టాలెక్కుతుంది. దీనికి ఆర్.ఎక్స్ 150 అని నామకరణం చేస్తాడేమో మరి.