బాలయ్య బ్యూటీ హాట్‌ అండ్‌ కరోనా అవేర్‌నెస్‌.

మరిన్ని వార్తలు

బాలయ్యతో ‘జై సింహా’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ నటాషా దోషి గుర్తుంది కదా. ఫస్ట్‌ ఆఫర్‌ ఏకంగా బాలయ్య వంటి స్టార్‌ హీరో సరసన కొట్టేసింది. కానీ, ఆ తర్వాత ఈ అమ్మకుట్టికి పెద్దగా ఆఫర్లు దక్కలేదు. ఇటీవల నందమూరి హీరోనే మరో ఛాన్స్‌ ఇచ్చాడు. అదే ‘ఎంత మంచివాడవురా’ సినిమాలో కళ్యాణ్‌రామ్ తో స్పెషల్‌ సాంగ్‌. ఇకపోతే, తాజాగా ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో దర్శనమిచ్చింది. ఊరకనే రారు ముద్దుగుమ్మలు సోషల్‌ మీడియాలో అందాలారబోసి, ఆ పై ఆఫర్లు కొట్టేసేందుకే అనుకుంటున్నారా.? బట్‌ ఫర్‌ ఏ ఛేంజ్‌. ఇది కరోనా కాలమన్న సంగతి బొత్తిగా మర్చిపోయినట్లున్నారు.. అందుకే ఈ అమ్మకుట్టి తనకు తోచిన రీతిలో కరోనాపై అవేర్‌నెస్‌ పెంచే ప్రయత్నం చేసింది.

 

కరోనా సోకిన వారు తర్వాత వారి భవిష్యత్తును తలచుకుని చాలా బాధపడుతున్న సంగతి ఓ ఎత్తయితే, అసలు కరోనా సోకక ముందే, ఆ తీవ్రతను ముందే ఊహించుకుని బాధపడుతూ, మరణిస్తున్న వారు మరికొందరున్నారు. ఇలాంటి వారికే, తనదైన శౖలిలో కాస్త గ్లామర్‌ జోడించి నటాషా దోషి చిన్నపాటి క్లాస్‌ తీసుకుంది. చేతిలో ఓ గ్లాస్‌ పట్టుకుని గ్లాస్‌లో సగమే ఉందనుకుని బాధపడేకన్నా, సగమైనా ఉందని ఆనందించడం మేలు.. అంటూ నెగిటివిటీని పక్కన పెట్టి, పాజిటివిటీని స్ప్రెడ్‌ చేయడానికి బెస్ట్‌ ఎగ్జాంపుల్‌ ఎంచుకుంది. నెట్టింట్లో పోస్ట్‌ చేసిన ఓ ఫోటో ద్వారా నటాషా ఈ అవేర్‌నెస్‌ మంత్రాన్ని నెటిజన్స్‌కి విశదపరచాలనుకుంది. నటాషాలో గ్లామరే కాదండోయ్‌, ఈ టైప్‌ ఆఫ్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ కూడా దాగుంది చూశారుగా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS