ఓ మోస్తరు స్టార్ హీరోయిన్ హోదాని అందుకున్న ముద్దుగుమ్మ ప్రియమని పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. కొంత గ్యాప్ తీసుకుని, బుల్లితెరపై కొన్ని రియాల్టీ షోస్‌లో జడ్జ్‌గా కనిపిస్తూ బుల్లితెర వీక్షకుల్ని అలరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు మళ్లీ తన సినీ కెరీర్‌పై దృష్టి పెట్టింది. వరుసగా అవకాశాలు దక్కించుకుంటోంది. వరుస పెట్టి కొత్త ప్రాజెక్టులపై సైన్ చేస్తూ వస్తోంది. టాలీవుడ్‌లో రానా హీరోగా తెరకెక్కుతోన్న ‘విరాట పర్వం’ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్న ప్రియమణి, విక్టరీ వెంకటేష్ లీడ్ రోల్ పోషిస్తున్న ‘నారప్ప’లో హీరోయిన్‌గా నటిస్తోంది. వీటితో పాటు, మరో రెండు కొత్త తెలుగు ప్రాజెక్టుల్ని ఓకే చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు హిందీలోనూ ప్రియమణి జోరు పెంచింది.
అజయ్ దేవగణ్ నటిస్తున్న ‘మైదాన్’ సినిమాలో ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తోంది. కరోనా గోల లేకుంటే, ఈ సినిమా ఈ పాటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సంగతి అటుంచితే, కోలీవుడ్ నుండి కూడా ప్రియమణికి కొన్ని ఆఫర్లు వస్తున్నాయట. చూస్తుంటే, ప్రియమణి భవిష్యత్‌లో చాలా బిజీ అయిపోయేటట్లే కనిపిస్తోంది. అయితే, ఒకప్పుడు గ్లామర్‌తో కుర్రకారును కేక పుట్టించిన ప్రియమణి నుండి ఇంతకు ముందులా గ్లామర్ ఎక్స్‌పెక్ట్ చేయలేకపోవచ్చేమో కానీ, యాక్టింగ్ టాలెంట్‌లో అంతకు మించి అనేలా పర్‌ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌లో కనిపించి మెప్పించనుందట అందాల ప్రియమణి.