ఈ మధ్య సోషల్ మీడియాలో ఆకతాయిల అల్లరి తారాస్థాయికి చేరింది. కొంతమంది గుంపులుగా మారి.. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ అశ్లీల పోస్టింగులు, ట్రోలింగ్స్ చేస్తూ వేధించటం మొదలు పెడుతున్నారు. వాళ్లకి ఇవేమీ కొత్తకాదు.. దీనికి తోడు సెలబ్రిటీ పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి, ఇతర సెలబ్రిటీల మీద అభ్యంతరకర పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ లిస్టు లో 'ఆర్ఎక్స్100' సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి కూడా చేరాడు.
గత కొన్ని రోజులుగా ఈ బోల్డ్ డైరెక్టర్ ను, కొంత మంది సోషల్ మీడియాలో తన పేరు మీద ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ లో ఒక ఫేక్ అకౌంట్ సృష్టించి ఇతరులకు అశ్లీల మెసేజ్ లు పెట్టడం మొదలుపెట్టారు. ఈ విషయం తన దృష్టికి రావడం తో అజయ్, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఆ ఫేక్ అకౌంట్స్ ను చూపిస్తూ కంప్లైంట్ చేశాడు. దీని పై పోలీసులు దర్యాప్తు చేయటం మొదలుపెట్టారు.