కరోనాకి మరొకరు బలైపోయారు. ఈసారి టాలీవుడ్ లో కరోనా విషాదం నింపింది. ప్రముఖ నిర్మాత పోకూరి బాబూరావు సోదరుడు పోకూరి రామారావు కరోనాతో మృతి చెందారు. కరోనా సోకడంతో గత కొన్ని రోజులుగా హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. శుక్రవారకం రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. రామారావుకి టాలీవుడ్ తో మంచి అనుబంధమే ఉంది.
ఈతరం ఫిల్మ్స్‌పై నిర్మించిన ఎన్నో చిత్రాలకు పోకూరి రామారావు సమర్పకుడిగా వ్యవహరించారు. ఈతరం ఫిల్మ్స్ విజయవంతంగా సినిమాలు నిర్మించడంలో పోకూరి రామారావు పాత్ర ఎంతో ఉంది. రామారావు మృతికి టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రామారావుకి కరోనా సోకడంతో.. కుటుంబ సభ్యులు సైతం కరోనా పరీక్షలు చేయించుకున్నారు. వాళ్లంతా క్షేమమే అని తెలుస్తోంది.