2018 సంవత్సరంలో ఘన విజయం సాధించిన చిత్రాల్లో ఆర్ఎక్స్ 100 ఒకటి. దర్శకుడు రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మొదటి చిత్రం. ట్రైలర్ కి ముందు ఎటువంటి అంచనాలు లేని ఈ చిత్రం, ట్రైలర్ తో ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించింది. ట్రైలర్ చూస్తుంటే రామ్ గోపాల్ వర్మ లోని కొన్ని దర్శకత్వ కోణాలు మనకు కనిపిస్తాయి. గ్రామీణ రాజకీయాలు, పల్లెటూరు నాటు సరసం, ప్రేమను దర్శకుడు అజయ్ కళ్ళకి కట్టినట్టు చూపించాడు. కార్తికేయ మరియు పాయల్ రాజ్ పుత్ హీరో, హీరోయిన్లగా నటించారు.
ఈ చిత్రం సక్సెస్ అవ్వటంతో అజయ్ భూపతి కి మంచి పేరు రావడమే కాకుండా, అతని రెండో చిత్రం పై కూడా అంచనాలు పెరిగాయి. ఇప్పటికే ఆర్జీవీ నిర్మాణంలో ఒక సినిమా ఉంటుందని ప్రకటించడం జరిగింది. అయితే అజయ్ భూపతి రెండో లేదా మూడో చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో చేస్తాడని సమాచారం. బెల్లంకొండ శ్రీనివాస్ పెద్ద ప్రొడ్యూసర్ కొడుకే అయినప్పటికీ హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టంగానే ఉంది. పెద్ద పెద్ద దర్శకులతో తీసిన సినిమాలు అంతంత మాత్రంగానే ఆడాయి.
ఇటీవలే, శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వంలో కవచం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చినా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాడు. చూడాలిమరి.. అజయ్ భూపతి - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎటువంటి ఫలితాన్ని ఇస్తోందో.!