'ఇస్మార్ట్‌ శంకర్‌'గా యంగ్‌హీరో రామ్‌.!

మరిన్ని వార్తలు

డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌, ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీకి 'ఇస్మార్ట్‌ శంకర్‌' అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. 'డబుల్‌ సిమ్‌ కార్డ్‌ అండ్‌ డబుల్‌ దిమాక్‌' అంటూ టైటిల్‌తో కూడిన మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ సినిమాలో రామ్‌ క్యారెక్టర్‌ పేరు శంకర్‌ అట. చాలా తెలివైనోడట ఈ శంకర్‌. ఎలాంటి ప్రోబ్లమ్‌నైనా తన తెలివితేటలతో ఇట్టే సాల్వ్‌ చేసేస్తాడట.. అదీ ఈ శంకర్‌ స్టోరీ. 

 

మామూలుగానే పూరీ జగన్నాధ్‌ సినిమాల్లో హీరోలు ఫుల్‌ ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఇక రామ్‌ ఎనర్జీ సంగతి ప్రత్యేకంగా చెప్పనే అక్కర్లేదు. ఇక ఈ ఇద్దరు ఎనర్జిటిక్‌ పర్సన్స్‌ తోడైతే స్క్రీన్‌పై రచ్చ రచ్చే కదా. అదే జరగనుందేమో ఇప్పుడు 'ఇస్మార్ట్‌ శంకర్‌'తో. ఇదిలా ఉంటే, ఈ మధ్య హీరోలకు డిఫరెంట్‌ గెటప్స్‌ వేస్తున్నాడు డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌. మొన్న 'ఇజం' సినిమాతో కళ్యాణ్‌రామ్‌ని డిఫరెంట్‌ గెటప్‌తో తీసుకొచ్చాడు. ఇప్పుడు రామ్‌. 

 

లేటెస్టుగా విడుదలైన టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌లో రామ్‌ గెటప్‌ గురించే అంతా చర్చించుకుంటున్నారు. సినిమాలో ఫుల్‌ ఎనర్జీ ఉండబోతోందని ఈ గెటప్‌ చూస్తుంటేనే అర్ధమైపోతోంది. చేతిలో గన్‌, నోట్లో సిగరెట్‌ స్పెట్స్‌ రగ్గ్‌డ్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు రామ్‌. 'హలో గురూ ప్రేమ కోసమే' సినిమాలో స్మార్ట్‌గా నీట్‌ షేవ్‌లో రొమాంటిక్‌ లుక్‌లో కనిపించిన రామ్‌ ఇప్పుడు పూరీ సినిమా కోసం ఇదిగో ఇలా ఇస్మార్ట్‌ లుక్‌లోకి మారిపోయాడు. చూడాలి మరి కొత్త గెటప్‌, కొత్త సెటప్‌ రామ్‌కీ, పూరీకి సక్సెస్‌నిస్తాయో లేదో.! 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS