ప్రముఖ నటి సురేఖావాణి భర్త సురేష్ తేజ మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సురేష్ సోమవారం హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు. సురేఖా - సురేష్‌లది ప్రేమ వివాహం. సురేఖ టీవీ యాంకర్‌గా ఉన్నప్పుడే వీరిద్దరి పరిచయం జరిగింది. అప్పట్లో సురేష్ కొన్ని టీవీ షోలకు డైరెక్టర్‌గా ఉండేవారు. వీరికి సుప్రియ అనే ఓ కుమార్తె ఉంది. అయితే కొంతకాలంగా సురేఖ, సురేష్ విడి విడిగానే ఉంటున్నార్ట. కుటుంబ కలహాల వల్ల వీరిద్దరి మధ్య దూరం పెరిగిందని సమాచారం.
ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ఇరు కుటుంబాలు ఎంత ప్రయత్నించినా సఫలీకృతం కాలేదు. ఈ గొడవ విడాకుల వరకూ వెళ్లిందట. ఆ గొడవలన్నీ మర్చిపోయి ఇద్దరూ ఏకం అవుతారనుకున్న తరుణంలో సురేష్ మరణం.. సన్నిహితులను తీవ్రంగా కలచివేస్తోంది. టీవీ రంగానికి సేవలు చేసిన సురేష్ మృతిపట్ల బుల్లి తెర నటులు, దర్శకులు విషాదం వ్యక్తం చేస్తున్నారు.