చరణ్‌ మరో బాలీవుడ్‌ కనెక్షన్‌

మరిన్ని వార్తలు

రామ్‌చరణ్‌ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'ధృవ' సినిమా హిందీ వెర్షన్‌ బుల్లితెరపై ప్రదర్శితం కాబోతోంది. ఈ సినిమా కోసం బాలీవుడ్‌ నటుడు అజయ్‌దేవగన్‌ వాయిస్‌ ఇచ్చాడు. రామ్‌చరణ్‌ పాత్రకి అజయ్‌దేవగన్‌ డబ్బింగ్‌ చెబుతున్నాడు. ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ అజయ్‌దేవగన్‌, ఇది తనకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నానని అన్నాడు. 'ధృవ' సినిమా తనకు చాలా బాగా నచ్చిందని అజయ్‌దేవగన్‌ అంటున్నాడు. చరణ్‌ తనకు బాగా ఇష్టమైన హీరోల్లో ఒకడని కూడా అన్నాడు అజయ్‌ దేవగన్‌. చరణ్‌కి బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్‌ కూడా మంచి సన్నిహితుడేనని తెలుసు కదా. సినిమా నచ్చి, అందులోని పాత్ర, ఆ పాత్ర చుట్టూ భావోద్వేగాలు, ఇవన్నీ తనను బాగా ఆకట్టుకున్నాయని, అందుకే డబ్బింగ్‌ చెప్పడానికి ముందుకొచ్చానన్నాడు అజయ్‌ దేవగన్‌. 'ధృవ' సినిమా, తమిళంలో ఘనవిజయం సాధించిన 'తని ఒరువన్‌'కి రీమేక్‌గా తెరకెక్కిందన్న సంగతి తెలిసిందే. అరవింద్‌ స్వామి ఈ సినిమాలో విలన్‌గా నటించాడు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటించింది. తెలుగులో మంచి విజయం దక్కింది ఈ సినిమాకి. ఇదిప్పుడు హిందీలోకీ రీమేక్‌ కాబోతోంది. ఈలోగా 'ధృవ' హిందీ వెర్షన్‌ బుల్లితెరపై ప్రదర్శితం కానుండడం ఆశ్చర్యకరం. అలాగే ఇప్పటికే 'తని ఒరువన్‌' కూడా హిందీలోకి డబ్‌ అయిపోయి అక్కడి బుల్లితెరపై కనిపించేసింది. మన మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ 'ధృవ' అక్కడ ఎంత పాపులర్‌ అవుతుందో చూడాలిక.రామ్‌చరణ్‌ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'ధృవ' సినిమా హిందీ వెర్షన్‌ బుల్లితెరపై ప్రదర్శితం కాబోతోంది. ఈ సినిమా కోసం బాలీవుడ్‌ నటుడు అజయ్‌దేవగన్‌ వాయిస్‌ ఇచ్చాడు. రామ్‌చరణ్‌ పాత్రకి అజయ్‌దేవగన్‌ డబ్బింగ్‌ చెబుతున్నాడు. ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ అజయ్‌దేవగన్‌, ఇది తనకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నానని అన్నాడు. 'ధృవ' సినిమా తనకు చాలా బాగా నచ్చిందని అజయ్‌దేవగన్‌ అంటున్నాడు. చరణ్‌ తనకు బాగా ఇష్టమైన హీరోల్లో ఒకడని కూడా అన్నాడు అజయ్‌ దేవగన్‌. చరణ్‌కి బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్‌ కూడా మంచి సన్నిహితుడేనని తెలుసు కదా. సినిమా నచ్చి, అందులోని పాత్ర, ఆ పాత్ర చుట్టూ భావోద్వేగాలు, ఇవన్నీ తనను బాగా ఆకట్టుకున్నాయని, అందుకే డబ్బింగ్‌ చెప్పడానికి ముందుకొచ్చానన్నాడు అజయ్‌ దేవగన్‌. 'ధృవ' సినిమా, తమిళంలో ఘనవిజయం సాధించిన 'తని ఒరువన్‌'కి రీమేక్‌గా తెరకెక్కిందన్న సంగతి తెలిసిందే. అరవింద్‌ స్వామి ఈ సినిమాలో విలన్‌గా నటించాడు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటించింది. తెలుగులో మంచి విజయం దక్కింది ఈ సినిమాకి. ఇదిప్పుడు హిందీలోకీ రీమేక్‌ కాబోతోంది. ఈలోగా 'ధృవ' హిందీ వెర్షన్‌ బుల్లితెరపై ప్రదర్శితం కానుండడం ఆశ్చర్యకరం. అలాగే ఇప్పటికే 'తని ఒరువన్‌' కూడా హిందీలోకి డబ్‌ అయిపోయి అక్కడి బుల్లితెరపై కనిపించేసింది. మన మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ 'ధృవ' అక్కడ ఎంత పాపులర్‌ అవుతుందో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS