అందాల భామ తాప్సీకి తెలుగు సినిమాలతోనే స్టార్‌డమ్ వచ్చింది. కానీ బాలీవుడ్‌కి వెళ్ళాక టాలీవుడ్‌ని మర్చిపోయింది. సహజంగా బాలీవుడ్‌కి వెళ్లాక టాలీవుడ్‌ని ఎవ్వరూ మర్చిపోరు. కానీ తాప్సీ ఈ విషయంలో కొంచెం ఎక్కువే చేస్తోందనుకోవాలి. తెలుగు సినీ పరిశ్రమపై సెటైర్లు వేయడం ద్వారా వివాదాల్లోకి ఎక్కింది. అన్నట్లు ఈ బ్యూటీ తిరిగి తెలుగు సినీ పరిశ్రమలోకి రీ-ఎంట్రీ ఇస్తోంది కూడా. 'ఆనందో బ్రహ్మ' అనే సినిమాలో నటించిన తాప్సీ ఆ సినిమా ప్రమోషన్ కోసం హైద్రాబాద్‌లో కనిపించింది. అయితే ఇదివరకటిలా తాప్సీ తెలుగులో మాట్లాడలేకపోతోంది. తెలుగు మాట్లాడటం కష్టంగా మారిపోయింది తాప్సీకి. 'మొగుడు' సినిమా కోసం తాప్సీ తెలుగులోనే డబ్బింగ్ కూడా చెప్పుకుంది. అలాంటి తాప్సీ తెలుగు మర్చిపోవడమే ఆశ్చర్యకరంగా ఉందంటున్నారు. తెలుగు సినిమాల్లో ఎక్స్‌పోజింగ్‌కి మాత్రమే అవకాశాలుంటాయనీ, నటనకు పెద్దగా ప్రాధాన్యత ఉండదని చెప్పడం ద్వారా తెలుగు సినిమాపై తన వ్యతిరేకతను బయటపెట్టుకుంది తాప్సీ. అలాగే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, ఆ తర్వాత సారీ చెప్పింది. స్టార్‌డమ్ కోసం తప్ప, తెలుగు సినీ పరిశ్రమపై మమకారం తాప్సీ ఎప్పుడూ చూపలేదని అర్థమౌతుందంటున్నారు కొందరు. ఆ విమర్శలకు తాప్సీ సమాధానమిచ్చేలా తిరిగి తెలుగులో గలగలా మాట్లాడేస్తూ, తెలుగు సినిమాల్లో విరివిగా నటిస్తుందేమో చూడాలిక.