ఉపాసన కొణిదెల- ఇటు రామ్ చరణ్ భార్యగానే కాకుండా అటు బిజినెస్ వుమన్ గా పేరు ప్రఖ్యాతలు గడించింది.
అయితే ఆమె అపోలో హెల్త్ కేర్ విభాగంలో వైస్ ప్రెసిడెంట్ గా ఉంటూ ముఖ్యంగా పిల్లల ఆరోగ్యానికి సంబంధించి చాలా కార్యక్రమాలే చేపట్టారు. దీనికి గాను, ఉపాసనకి ఈ ఏటీ ఫెమినా విమెన్ అవార్డుని అందించారు. ఆమె హెల్త్ కేర్ రంగంలో చేస్తున్న కృషికి ఈ అవార్డుని అందించినట్టు తెలిసింది.
ఇదే విషయాన్ని ఉపాసన కూడా తన ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. మొత్తానికి మెగా ఫ్యామిలీ కోడలు అయిన ఉపాసన తను నిజంగా మెగా కోడలినే అని నిరూపించుకుంది.