సూపర్‌హిట్‌ కాంబో ఇంకోస్సారి.!

By iQlikMovies - August 23, 2018 - 12:20 PM IST

మరిన్ని వార్తలు

తెలుగులో 'శంఖం', 'శౌర్యం' అంటూ 'శ' లెటర్‌ సెంటిమెంట్‌తో హీరో గోపీచంద్‌తో రెండు సినిమాలు రూపొందించిన డైరెక్టర్‌ శివ. తర్వాత రవితేజతో 'దరువు' చిత్రాన్ని రూపొందించింది కూడా ఈయనే. అయితే ఈ మూడు తెలుగు చిత్రాలూ ఓ మాదిరి హిట్స్‌ అందుకుంటే, తమిళంలో అజిత్‌తో శివ తెరకెక్కించిన సినిమాలు మాత్రం సూపర్‌ డూపర్‌ హిట్స్‌గా నిలిచాయి. 

తమిళంలోనే కాదు, తెలుగులో కూడా బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ అందుకున్నాయి అజిత్‌ - శివ కాంబోలో తెరకెక్కిన సినిమాలు. 'వీరం', 'వేదాళం', 'వివేగం' ఈ మూడు సినిమాలతో హ్యాట్రిక్‌ కొట్టిన ఈ కాంబినేషన్‌ మరోసారి హ్యాట్రిక్‌ని బిగిన్‌ చేసింది. అదే 'విశ్వాసం' సినిమాతో. ఒకటే లెటర్‌. 'వి'. చివర సున్న ఈ డైరెక్టర్‌ సెంటిమెంట్‌. మూడు సార్లు కలిసొచ్చింది. నాలుగోసారి కూడా అదే లెటర్‌ సెంటిమెంట్‌. అదే హీరో. అలాంటి పవర్‌ ఫుల్‌ స్టోరీనే. 

తాజాగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. కిర్రాక్‌ లుక్‌. ఈ సినిమాలో అజిత్‌ డబుల్‌ రోల్‌ పోషిస్తున్నాడు. ఓ క్యారెక్టర్‌ కోసం వైట్‌ హెయిర్‌తో కనిపిస్తున్నాడు. మరో క్యారెక్టర్‌ కోసం ఫుల్‌ బ్లాక్‌ హెయిర్‌తో కనిపిస్తున్నాడు. ఇంతవరకూ నేచురల్‌ హెయిర్‌ స్టైల్‌తో హిట్స్‌ మీద హిట్స్‌ కొట్టేసిన అజిత్‌ ఈ సారి కొంచెం కొత్తగా హెయిర్‌ స్టైల్‌ ట్రై చేశాడు. బ్లాక్‌ హెయిర్‌తో మళ్లీ లవర్‌ బోయ్‌ గెటప్‌లోకి మారిపోయాడు. చాలా కాలం తర్వాత అజిత్‌ ఈ లుక్‌లో కనిపిస్తున్నాడు. గుబురు గెడ్డం, మెలి తిరగిన మీసం పక్కా మాస్‌ లుక్స్‌ ఈ రెండు. 

చూడాలి మరి ఈ సినిమాతో ఈ కాంబో మరో హ్యాట్రిక్‌కి శ్రీకారం చుడతారేమో. ఈ సినిమాలో అజిత్‌కి జోడీగా నయనతార నటిస్తోంది. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS