దేవ్‌, దాస్‌ లవర్స్‌ని దించేశారు.!

మరిన్ని వార్తలు

నాగార్జున, నాని మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం 'దేవదాస్‌'కి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ వచ్చేసింది. దేవాగా నటిస్తున్న నాగార్జునకు జోడీగా ఈ సినిమాలో 'మళ్లీ రావా' ఫేం ఆకాంక్షసింగ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. 

అయితే నాగ్‌ పక్కన ఆమె ఎలా ఉండబోతోందో అనే డౌట్‌ అందరిలోనూ ఉందింతవరకూ. అందుకే ఆ డౌట్‌ నేటితో క్లియర్‌ చేసేశారు కింగ్‌ నాగార్జున. ఆకాంక్షసింగ్‌ని అందంగా పరిచయం చేసేశారు. నిండైన చీరకట్టు, బొట్టుతో అచ్చు నాగార్జునకి సరిజోడీగా ఉంది ఆకాంక్షసింగ్‌. జాహ్నవి ఆమె పేరు. 'చాలా కాలం తర్వాత నా పక్కన అందమైన అమ్మాయి. మళ్లీ రొమాన్స్‌.. ఈ రోజు సాయంత్రం మరో లిరికల్‌ సాంగ్‌ని విడుదల చేయబోతున్నాం..' అంటూ నాగార్జున జాహ్నవిని అదే ఆకాంక్షసింగ్‌ ఫస్ట్‌లుక్‌ని ట్విట్టర్‌లో విడుదల చేశారు. 

మరి ఈ సినిమాలో మరో హీరో నానిగారు ఏమైనా తక్కువ తింటారా? ఆయన కూడా తన లవర్‌ని అంతే అందంగా పరిచయం చేసేశారు. నాగార్జునతో పోల్చితే నాని యంగ్‌స్టర్‌ కదా. అందుకే యూత్‌ఫుల్‌గా తన లవర్‌ని పరిచయం చేశాడు. 'ఫస్ట్‌ టైం మెట్రోలో చూసినప్పుడే లోపల ఏదో రింగయ్యింది పూజా గారు.. మళ్లీ ఎప్పుడు.?' అంటూ రష్కికా లుక్‌ని పరిచయం చేశాడు. మోడ్రన్‌ గాళ్‌లా రష్మికా ఎప్పటిలాగే అందంగా ఉంది. 

ఇంకెందుకాలస్యం దేవ్‌, దాస్‌ లవర్స్‌ జాహ్నవి, పూజాలను మీరు కూడా పరిచయం చేసేస్కోండి. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'దేవదాస్‌' సినిమాని వైజయంతీ బ్యానర్‌లో అశ్వనీదత్‌ నిర్మిస్తున్నారు. ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS