స్టన్నింగ్‌ అండ్‌ 'రొమాంటిక్‌' ఫస్ట్‌లుక్‌!

మరిన్ని వార్తలు

ఇంకేముంది పూరీ తనయుడు ఆకాష్‌ పూరి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ఆగిపోయిందంటూ ప్రచారం జరిగింది ఈ మధ్య. కానీ, 'రొమాంటిక్‌' టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేసి, షాక్‌ ఇచ్చాడు పూరీ జగన్నాధ్‌. లుక్‌ గురించి మాట్లాడుకోవాలంటే, మాటల్లేవ్‌.. మాట్లాడుకోవడాల్లేవ్‌.. టైటిల్‌కి తగ్గట్లే పక్కా రొమాంటిక్‌. టాప్‌లెస్‌ హీరోయిన్‌ డీప్‌ హగ్గింగ్‌ విత్‌ హీరో. మరి ఈ రొమాంటిక్‌ లుక్‌లో కనిపిస్తున్న ముద్దుగుమ్మ ఎవరో తెలుసా? పేరు కేతికా శర్మ. అమ్మడికి ఈ టాప్‌లెస్‌లూ, హాట్‌ అప్పీల్స్‌ అస్సలు కొత్తేం కాదు. సోషల్‌ మీడియాలో ఆల్రెడీ దుమ్ము లేపేసిందీ ఢిల్లీ బ్యూటీ.

 

వెతికి వెతికి ఈ పాపని పూరీ ఎందుకు పట్టుకొచ్చాడో ఈ ఫస్ట్‌లుక్‌ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. టైటిల్‌కి తగ్గట్లు సినిమాలో కంటెంట్‌ కూడా ఎలా ఉండబోతోందో ఓ ఐడియాకి వచ్చేసి ఉంటారు ఆడియన్స్‌. అవును పక్కా యూత్‌ఫుల్‌ మూవీ ఇది. పూరీ కథతో, పూరీ మార్క్‌ డైలాగ్స్‌తో, పూరీ శైలి స్క్రీన్‌ప్లేతో సినిమా రూపొందుతోంది. డైరెక్టర్‌ మాత్రం ఆయన కాదు.. అనిల్‌ పాడూరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, టూరింగ్‌ టాకీస్‌, పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌లో పూరీ జగన్నాధ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంత రొమాంటిక్‌ యాంగిల్‌లో వదిలిన ఈ లుక్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. తొలి సినిమాతోనే హాట్‌ బ్యూటీ కేతికా శర్మకి ఫుల్‌ క్రేజ్‌ తెప్పించేలా ఉన్నాడు మన క్రియేటివ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS