తమన్నా: గ్లామర్‌ ప్లస్‌ యాక్షన్‌.!

మరిన్ని వార్తలు

మిల్కీ బ్యూటీ తమన్నా అంటే, ఎవరైనా గ్లామర్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు ఆమె నుండి. కానీ, 'సైరా'లో ఆలాంటి ఛాన్స్‌ ఉందా అంటే, ఖచ్చితంగా ఉందనిపిస్తోంది. లేటెస్ట్‌గా విడుదలైన 'ఉయ్యాలవాడ నారసింహుడా..' టైటిల్‌ సాంగ్‌లో తమన్నా పర్‌ఫామెన్స్‌ కేక పుట్టిస్తోంది. ఓ వైపు యాక్షన్‌, ఇంకో వైపు అందం, మరో వైపు వారెవ్వా అనే పర్‌ఫామెన్స్‌తో ఆకట్టుకుంటోంది. ఇక గ్లామర్‌ ఆశించే ప్రేక్షకుల్నీ డిజప్పాయింట్‌ చేయలేదు. అందంతో పాటు, అలా అలా హాట్‌ అప్పీల్‌ కూడా ఇచ్చేసింది. సో తమన్నాని ఆ స్థాయిలో ఊహించలేదెవ్వరూ.

 

అంతకు మించి అనే స్థాయిలోనే తమన్నా ఆకట్టుకోనుందని తెలుస్తోంది. ఇక ఈ సాంగ్‌ లిరిక్సే కాదు, విజువలైజేషన్‌ కూడా అదిరిపోయిందని లేటెస్ట్‌ ప్రోమో ద్వారా అర్ధమవుతోంది. ఈ సాంగ్‌ వీడియోలో తమన్నా, నయనతార ఇద్దరికిద్దరూ పోటా పోటీగా పర్‌ఫామెన్స్‌ ఇస్తున్నారు. నయనతారలో కొంచెం హుందాతనం ఎక్కువ కనిపిస్తుండగా, తమన్నాలో రాజసం బాగా ఉట్టిపడుతోంది.

 

ఆమె పర్‌ఫామెన్స్‌లో ఇంతకు ముందెన్నడూ చూడని కాన్ఫిడెన్స్‌ కనిపిస్తోంది. సో తమన్నా కెరీర్‌కి 'సైరా' ఖచ్చితంగా ప్లస్‌ పాయింట్‌ అవుతుందనడంలో సందేహమే లేదు. ఓ వైపు 'సైరా' కోసం ఇంత హుందా అయిన పాత్ర పోషించిన తమన్నా, మరోవైపు 'సరిలేరు..' కోసం ఐటెం అవతారమెత్తిన సంగతి కూడా తెలిసిందే. 'సరిలేరు నీకెవ్వరూ..' సినిమాలో మహేష్‌బాబు సరసన స్పెషల్‌ సాంగ్‌లో నటిస్తోంది తమన్నా. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS