విష్ణు హాలీవుడ్ సినిమాలో.. బాలీవుడ్ స్టార్‌

మరిన్ని వార్తలు

వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న మంచు విష్ణు ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ కే గురి పెట్టాడు. విష్ణు క‌థానాయ‌కుడిగా ఓ హాలీవుడ్ సినిమా త‌యార‌వుతుంది. కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

 

జెఫ్రీచిన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుగుతోంది. ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర కోసం సునీల్ శెట్టిని ఎంచుకున్నారు. ఇటీవ‌ల సునీల్ శెట్టిని క‌లిసిన టీమ్‌.. క‌థ వినిపించింది. క‌థ‌, అందులో త‌న పాత్ర న‌చ్చ‌డంతో సునీల్ ఈ ప్రాజెక్టుకు ప‌చ్చ జెండా ఊపేశాడు. త్వ‌ర‌లోనే సునీల్ శెట్టి సెట్‌లో పాల్గొంటాడ‌ని తెలుస్తోంది. తెలుగు, ఇంగ్లీష్ భాష‌ల్లో స‌మాంత‌రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో రుహానీ సింగ్ మ‌రో క‌థానాయిగా న‌టించ‌నుంది.

 

ఈటీమ్‌లో చాలామంది హాలీవుడ్ నిపుణులే ప‌నిచేస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS